Anil Ravipudi: అనిల్‌ రావిపూడి నాలుగు కథలు రిజక్ట్‌ అయ్యాయి.. ఎవరు చేశారో తెలుసా?

టాలీవుడ్‌లో 100 శాతం స్ట్రైక్‌ రేట్‌తో దూసుకెళ్తున్న దర్శకుడు అనిల్‌ రావిపూడి. ఏ జోనర్‌లో సినిమాలు చేసినా, ఏ హీరోతో సినిమా చేసినా, ఆ హీరో పెద్ద కథానాయకుడు అయినా, యువ కథానాయకుడు అయినా ఫలితం మాత్రం హిట్‌. అన్నట్లు ఆ సినిమా ఏ సీజన్‌లో వచ్చినా విజయం పక్కా. అలాంటి జోష్‌లో ఉన్నాడు అనిల్‌ రావిపూడి. ఇప్పుడు మెగాస్టార్‌ చిరంజీవితో ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ అంటూ సంక్రాంతికి రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర మాట ఆయన నుండే తెలిసింది.

Anil Ravipudi

అనిల్‌ రావిపూడి ఇప్పుడు దర్శకుడిగా అందరికీ పరిచయం కానీ.. ఘోస్ట్‌ రైటర్‌గా, స్క్రీన్‌ప్లే రైటర్‌గా, కథా రచయితగా చాలా ఏళ్లు పని చేశారు. ఆ అనుభవం, ఆ సమయంలో రిజక్షన్లు దాటుకుని ముందుకొచ్చారు. అయితే ఇప్పుడు ఆయన పట్టుకుందల్లా బంగారం కాదు, ఆయన చెప్పిన స్క్రిప్ట్‌లన్నీ హీరోలు ఓకే చేసేయడం లేదు. ఇప్పటివరకు ఆయన ఓ ఇద్దరు హీరోలకు చెప్పిన నాలుగు కథలు రిజక్ట్ అయ్యాయట. ఆ ఇద్దరూ స్టార్‌ హీరోలే.

ఎన్టీఆర్ గారికి గతంలో రెండు, మూడు కథలు చెప్పారట అనిల్‌ రావిపూడి. అలాగే అల్లు అర్జున్‌తో కూడా ఓ స్టోరీ మీద డిస్కస్ చేశారట. కానీ ఆ కథలేవీ వర్కవుట్ కాలేదట. అయితే వీటి విషయంలో ఫెయిల్యూరే తనవైపే ఉందని అనుకుంటాను అని సానుకూలంగా మాట్లాడారు అనిల్‌. ఆ హీరోలను ఎగ్జైట్ చేసేలా ఆ కథలు సిద్ధం చేయలేకపోయానేమో అని అన్నారాయన. లేదంటే ఆ కథలు చెప్పే సమయానికి తనపై ఆ హీరోలకు నమ్మకం లేకపోయి ఉండొచ్చు అని చెప్పారు.

అనిల్‌ మాటలు వింటుంటే ఆయన ఇంకా స్టార్‌ దర్శకుడు కాకముందు ఆ కథలు చెప్పారు అని అర్థమవుతోంది. మరిప్పుడు అలాంటి ఆలోచన ఏమీ చేయడం లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే ముగ్గురు సీనియర్‌ హీరోలతో సినిమాలు చేసిన అనిల్‌.. నెక్స్ట్‌ టార్గెట్‌ నాగార్జునే అని సమాచారం.

ఆ 20 నిమిషాలు నెక్స్ట్ లెవెల్.. ప్రభాస్ కి ఇంకో హిట్టు పడినట్టేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus