Anil Ravipudi: నా భార్య అందుకే నన్ను ఇప్పటికీ దెప్పిపొడుస్తుంటుంది : అనిల్ రావిపూడి

అనిల్ రావిపూడి సినిమాల్లో ఎంత ఫన్ క్రియేట్ చేస్తుంటాడో.. నిజ జీవితంలో కూడా అదే విధంగా ఫన్ క్రియేట్ చేస్తుంటాడు. ఆయన తాజా చిత్రం ‘ఎఫ్3’ ఈ శుక్రవారం అంటే మే 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ప్రమోషన్లలో భాగంగా ఆయన ఏదో ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ ఉంటున్నారు. అదే విధంగా బిత్తిరి సత్తి యాంకర్ గా వ్యవహరిస్తున్న ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇందులో భాగంగా కొంచెం ఫ్లాష్ బ్యాక్ కు వెళ్లి…

తన కాలేజీ రోజులను గుర్తు చేసుకున్నాడు. అనిల్ అలాగే అతని భార్య భార్గవి ఒకే కాలేజీలో చదువుకున్న సంగతి అతను చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. అయితే అనిల్ కాలేజీలో ఉన్నప్పుడు తన భార్యని చూసేవాడు కాదట. తన స్నేహితులతో కలిసి వేరే అమ్మాయిని ఫాలో అయ్యేవాడట. కానీ ఆ అమ్మాయి పడలేదు. ఆ టైములో అదే బ్యాచ్ లో ఉన్న అనిల్ రావిపూడి భార్య కూడా ఈ విషయాన్ని గమనించేదట.

ఫైనల్ గా ఆ అమ్మాయి బ్యాచ్ లో ఉన్న మరో అమ్మాయితో అనిల్ పెళ్లి అయ్యిందట.ఆమెనే భార్గవి. అందుకే కాలేజీ రోజుల్లో తనని కాకుండా వేరే అమ్మాయిని చూసేవాడివి అంటూ చీటికీ మాటికీ అనిల్ ను ఆమె దెప్పిపొడుస్తుంటుంది అని ఆయన తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అనిల్ రావిపూడి ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాకి చెందిన వ్యక్తి.ఇతని తండ్రి ఆర్టీసీలో కండక్టర్ గా పనిచేస్తూ ఉండేవారు.

కెరీర్ ప్రారంభంలో అనిల్ రావిపూడి.. శౌర్యం, శంఖం, మసాలా, ఆగడు, కందిరీగ, దరువు వంటి చిత్రాలకి అసిస్టెంట్ గా పనిచేసాడు. ఇప్పుడైతే అపజయం అంటే తెలియని దర్శకుడిలా దూసుకుపోతున్నాడు. మరి ‘ఎఫ్3’ తో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో..!

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus