Chiranjeevi: చిరు సినిమాపై ఒకేసారి రెండు అప్‌డేట్స్‌ ఇవ్వనున్న అనిల్ రావిపూడి.. అప్పుడే?

మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు అనౌన్స్ చేసినప్పటి నుండి ‘కచ్చితంగా ఇది బ్లాక్ బస్టర్’ అనే టాక్ వినిపిస్తూనే ఉంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ శరవేగంగా కంప్లీట్ అవుతోంది. ఇప్పుడు మెగా ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే ఓ న్యూస్ బయటికొచ్చింది. బాస్ బర్త్‌డేకి చిరంజీవి నెక్స్ట్ సినిమాల అప్డేట్స్ ఇవ్వడం ఆనవాయితీగా మారింది.ఈసారి కూడా ఆ రోజుని ఫ్యాన్స్‌కు ఓ మెమరబుల్ ఈవెంట్‌గా మార్చేందుకు రంగం సిద్ధమైంది.

Chiranjeevi

ఆగస్టు 22న ఒకేసారి రెండు పవర్‌ఫుల్ అప్‌డేట్స్‌తో ఫ్యాన్స్‌ను ఖుషి చేసేందుకు రెడీ అవుతున్నారు చిరు- అనిల్. ఆ రోజునే టైటిల్‌పై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందట. దాంతో పాటే, సినిమా రిలీజ్ డేట్‌ను కూడా లాక్ చేసి అఫీషియల్‌గా అనౌన్స్ చేయబోతున్నారని టాక్ గట్టిగా వినిపిస్తోంది.

పక్కా ప్లానింగ్‌తో 2026 సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాని రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. అనిల్ రావిపూడి తన మార్క్ స్పీడ్‌తో ఇప్పటికే కీలక షెడ్యూల్స్‌ను చకచకా పూర్తిచేశాడు. బ్రేకులు లేకుండా సాగుతున్న షూటింగ్‌తో సంక్రాంతి రిలీజ్ పక్కా అని ఇండస్ట్రీ వర్గాలు కోడై కూస్తున్నాయి.ఈసారి థియేటర్లలో నవ్వుల సునామీతో పాటు, కంటతడి పెట్టించే ఎమోషన్స్ కూడా గ్యారంటీ అంటున్నారు. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ టైమింగ్‌కు, మెగాస్టార్ ఎనర్జీ తోడైతే స్క్రీన్ షేక్ అవ్వడం గ్యారంటీ. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా అతిథి పాత్రలో కనిపించనున్నారు అని సమాచారం.

‘మనం కొట్టినమ్’… ‘కింగ్డమ్’ రిజల్ట్ పై రష్మిక స్పందన

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus