Rashmika Mandanna: ‘మనం కొట్టినమ్’… ‘కింగ్డమ్’ రిజల్ట్ పై రష్మిక స్పందన

విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక..ల వ్యవహారం ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. రూమర్డ్ కపుల్ గా వార్తల్లో ఉంటున్నప్పటికీ.. వీళ్ళు పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నారు అనే టాక్.. ఎప్పటికప్పుడు వస్తూనే ఉంది. ‘గీత గోవిందం’ సినిమాతో వీరి మధ్య స్నేహం ఏర్పడింది. అది ప్రేమగా మారడంతో రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుంది రష్మిక అనే టాక్ కూడా అప్పుడు గట్టిగానే రన్ అయ్యింది.

Rashmika Mandanna

తర్వాత ‘డియర్ కామ్రేడ్’ సినిమా షూటింగ్ టైంలో వీళ్ళు పీకల్లోతు ప్రేమలో పడిపోయినట్టు కూడా టాక్ నడిచింది. ఆ తర్వాత వీళ్ళు కలిసి ఎక్కువగా కనిపించింది లేదు. కానీ ఛాన్స్ దొరికిన ప్రతిసారి కలుస్తూనే ఉన్నారు. మీడియా కంట పడుతూనే ఉన్నారు. ముఖ్యంగా బాలీవుడ్ మీడియా వీరు ప్రేమలో ఉన్నట్లు ఇండియా మొత్తం ప్రచారం చేసింది.

ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. విజయ్ దేవరకొండ ఆల్మోస్ట్ 7 ఏళ్ళ నుండి సరైన హిట్టు లేక అల్లాడుతున్నాడు. ప్రతి సినిమాకి చాలా కష్టపడి చేస్తున్నాడు.. కానీ సక్సెస్ కొట్టలేకపోతున్నాడు. ఈ క్రమంలో ‘కింగ్డమ్’ చేశాడు. విజయ్ దేవరకొండ కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమాని నాగవంశీ నిర్మించాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. ఈరోజు అనగా జూలై 31న రిలీజ్ అయిన ‘కింగ్డమ్’ సినిమా మొదటి షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా పెరుగుతూ వస్తున్నాయి. వీకెండ్ కు కచ్చితంగా మంచి ఓపెనింగ్స్ సాధించే అవకాశం లేకపోలేదు. ఈ సందర్భంగా రష్మిక కూడా తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.

‘ఈ సక్సెస్ నీకు అలాగే నిన్ను ప్రేమించే వారికి ఎంత ముఖ్యమో నాకు తెలుసు. ‘మనం కొట్టినమ్’ ‘ అంటూ విజయ్ దేవరకొండని తన శైలిలో కంగ్రాట్యులేట్ చేసింది రష్మిక. అందుకు విజయ్ దేవరకొండ కూడా ‘మనం కొట్టినమ్’ అంటూ ఒక లవ్ సింబల్ పెట్టి బదులిచ్చాడు. ఈ టాపిక్ ఇప్పుడు హైలెట్ గా మారింది.

‘హరిహర వీరమల్లు’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus