Anil Ravipudi: ఇంటర్వ్యూ : ‘భగవంత్ కేసరి’ గురించి దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పిన ఇంట్రెస్టింగ్ విషయాలు!

  • October 17, 2023 / 04:06 PM IST

నందమూరి బాలకృష్ణ హీరోగా ‘భగవంత్ కేసరి’ అనే సినిమా రూపొందింది. అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకుడు. అక్టోబర్ 19 న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో అతను ప్రమోషన్స్ లో పాల్గొని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు. అవి మీకోసం :

ప్ర) మొదటిసారి కామెడీ సపోర్ట్ లేకుండా సినిమా చేసినట్టు ఉన్నారు?

అనిల్ రావిపూడి : కామెడీ అనేది పక్కన పెడితే ఎంటర్టైన్మెంట్ ను మాత్రం మిస్ చేయలేదు. నేను ఆరు సినిమాలు చేశాను. అంటే.. ఒక ఓవర్ అయిపోయింది అని భావిస్తున్నాను. ఇప్పుడు ఇంకో ఓవర్ కాబట్టి.. ఎమోషన్, యాక్షన్ తో సినిమా చేయాలని భావించి ఈ సినిమా తీశాను.

ప్ర) సోషల్ మీడియాలో మీ సినిమాల పై నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తూ ఉంటాయి. రొటీన్ కామెడీ అంటూ ఏవేవో కామెంట్లు చేస్తుంటారు. వాటికి ఫుల్ స్టాప్ పెట్టడానికే ఈ సినిమా చేశారా?

అనిల్ రావిపూడి : అస్సలు కాదు. ఏ సినిమా చేసినా అది అందరికీ నచ్చదు. ఇద్దరు బాగుంది అంటారు. ఇంకో ముగ్గురు పర్వాలేదు అంటారు. ఇంకో ఇద్దరు ఇలా చేసుంటే బాగుణ్ణు అంటూ ఐడియాలు ఇస్తారు. ఇంకో ముగ్గురు తిడతారు. ఒక డైరెక్టర్ గా నేను అన్నీ రిసీవ్ చేసుకుంటాను. దేని నుండి ఎస్కేప్ అవ్వాలనుకోవడం లేదు. అలా భావించి ఈ సినిమా చేశాను అనుకోవడం కరెక్ట్ కాదు.

ప్ర) ‘సరిలేరు నీకెవ్వరు’ లో ఆర్మీ థీమ్ ఉంది.. ఇందులో కూడా ఆర్మీ కనెక్ట్ ఉంది కదా ?

అనిల్ రావిపూడి : మహేష్ బాబు గారితో సినిమా అనుకున్నప్పుడే ఆర్మీ కథ చేయాలని ఫిక్స్ అయ్యాం. ‘భగవంత్ కేసరి’ లో చాలా గోల్స్ ఉన్నాయి, అమ్మాయిని ఆర్మీకి పంపడంతో పాటు అమ్మాయిని స్ట్రాంగ్ ఎలా చేయాలనే క్యారెక్టరైజేషన్ కూడా ఉంటుంది. అమ్మాయి కి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల వలన ఎలా వీక్ అయ్యింది? ఎలా స్ట్రాంగ్ చేయాలి అని హీరో ప్రయత్నించాడు? ‘అమ్మాయిని ఒక సింహంలా ఎలా తయారు చేశాడు’ అనేలా అన్నమాట.

ప్ర) అంటే ఈ సినిమాలో శ్రీలీలతో ఫైట్స్ కూడా చేయించారా?

అనిల్ రావిపూడి : అప్పుడే కన్ఫర్మ్ చేయకూడదు. కానీ కొంతవరకు కరెక్ట్(నవ్వుతూ)

ప్ర) ‘భగవంత్ కేసరి’ కి బాలకృష్ణ గారే ఎందుకు అంటే?

అనిల్ రావిపూడి : బాలకృష్ణ గారు కొత్త ఎలిమెంట్ ఉన్న కథని యాక్సప్ట్ చేస్తారు. ఒక మంచి కథ చెప్పాలి, ప్రయోగం చేయాలని అనుకుంటే ఆయన ముందు ఉంటారు. ఆదిత్య 369, భైరవద్వీపం.. ఇలా ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు చేసి ఘన విజయాలు సాధించారు. ‘అమ్మాయిని ఒక సింహంలా పెంచాలి’ ఈ కాన్సెప్ట్ ఆయనకి చాలా బాగా నచ్చింది. చాలా బలంగా నమ్మారు. ఒక స్టార్ హీరోగా ఉండి శ్రీలీల లాంటి అప్ కమింగ్, ఫుల్ ఫాం లో వున్న హీరోయిన్ కు ఫాదర్ గా చేయడానికి ఒప్పుకోవడం అంటే మాటలు కాదు..!

ప్ర) తెలంగాణ యాస చెప్పించాలనే ఆలోచన మీదేనా ?

అనిల్ రావిపూడి : అవును. తెలంగాణ యాసలో ఒక ముక్కుసూటి తనం ఉంటుంది. బాలకృష్ణ గారి వ్యక్తిత్వం దానికి దగ్గరగా ఉంటుంది. అందుకే..!

ప్ర) బాలకృష్ణ గారితో హిందీలో కూడా మాట్లాడించారు… ఆయన మీద వచ్చిన మీమ్స్ చూసి ఆ ఆలోచన కలిగిందా?

అనిల్ రావిపూడి : కాదండి.. ! తెలంగాణలో కొంతమంది హిందీ కూడా మాట్లాడతారు. దానికి సింక్ చేస్తూ పెట్టాము.

ప్ర) మీ అప్ కమింగ్ మూవీస్ లో మీ గత సినిమాల్లో హీరోయిన్ కనిపించడం ఆనవాయితీ కదా.. ఇందులో కూడా అలా ‘ఎఫ్ 3’ లో హీరోయిన్స్ ని పెట్టారా?

అనిల్ రావిపూడి : లేదు..! ఆ రూల్స్ ని సెంటిమెంట్లని బ్రేక్ చేసేశాను(నవ్వుతూ)

ప్ర) మీరు ఒక్కో మ్యూజిక్ డైరెక్టర్ తో మూడేసి సినిమాలకి పనిచేస్తున్నారు. తమన్ తో కూడా ఇంకో రెండు సినిమాలకి పని చేస్తారా?

అనిల్ రావిపూడి : సాయి కార్తిక్ తో మూడు, దేవి గారితో మూడు సినిమాలు చేశాను. ఇప్పుడు తమన్ తో కూడా జర్నీ చాలా బాగుంది. ఈ సినిమాకి చాలా హార్డ్ వర్క్ చేశాడు. తనతో జర్నీ కొనసాగించాలనే భావిస్తున్నాను. ఇందులో మొత్తం మూడు పాటలు ఉంటాయి. మూడు కూడా సిట్యువేషనల్ సాంగ్స్. మరో సాంగ్ తీసి పక్కన పెట్టాం. అది దసరాకి యాడ్ చేస్తాం.

ప్ర) నిర్మాతలు షైన్ స్క్రీన్స్ వారి గురించి చెప్పండి?

అనిల్ రావిపూడి : హరీష్, సాహు.. 2016 లో నాకు అడ్వాన్స్ ఇచ్చారు. దాదాపు ఐదేళ్ళు వెయిట్ చేశారు. సరైన సమయంలో సరైన ప్రాజెక్ట్ చేశాను అని నేను అనుకుంటున్నాను.

ప్ర) మీ అప్ కమింగ్ సినిమాల గురించి?

అనిల్ రావిపూడి : ప్రస్తుతం నా (Anil Ravipudi) ఫోకస్ మొత్తం భగవంత్ కేసరి విడుదల పైనే ఉంది. దీని విడుదల తర్వాతే మరో సినిమా గురించి ఆలోచిస్తాను.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus