Anil Ravipudi : క్రింజ్ అన్నారు.. ట్రోల్ చేసారు.. కట్ చేస్తే జాతీయస్థాయిలో అవార్డ్ గెలుచుకున్న అనిల్ రావిపూడి !

Advertisement

టాలీవుడ్‌లో ఎంటర్టైన్మెంట్ జానర్ తో వరుస సినిమాల హిట్లు కొడుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి, మరోసారి తన ప్రతిభను జాతీయ స్థాయిలో చాటుకున్నారు. కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్‌లతో ప్రేక్షకులను అలరించే ఆయన, తాజాగా ప్రతిష్టాత్మక అవార్డు అందుకోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ మారింది. ఒకప్పుడు “క్రింజ్” అంటూ విమర్శలు ఎదుర్కొన్న అనిల్, ఇప్పుడు అదే స్టైల్‌తో సినిమాలు తీసి అవార్డులు అందుకోవడం విశేషం.

Anil Ravipudi

గత సంవత్సరం సంక్రాంతికి విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించడంతో పాటు, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ మేళవింపుతో రూపొందించిన తీరు ఆయనకు ప్రత్యేక గుర్తింపునిచ్చింది. ఈ చిత్ర విజయంతో పాటు, దర్శకుడిగా చూపిన కంటెంట్ హ్యాండ్లింగ్‌కు గాను ఆయనకు ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ అవార్డులలో ఉత్తమదర్శకుడు పురస్కారం లభించింది.

దర్శకుడిగా మొదటి సినిమా నుంచే వరుస విజయాలతో ముందుకు సాగుతున్న అనిల్ రావిపూడి, కమర్షియల్ ఎలిమెంట్స్‌ను సరదా హ్యూమర్‌తో కలిపి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్నారు. అందుకే ఆయన సినిమాలు మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అందరికీ చేరువ అవుతుంటాయి.

ముంబైలో జరిగిన అవార్డు వేడుకలో ఈ గౌరవాన్ని అందుకున్న ఆయన, తన ప్రయాణంలో తోడ్పడిన నిర్మాతలు, నటులు, ముఖ్యంగా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ గుర్తింపు తనపై మరింత బాధ్యత పెంచిందని, ఇకపై మరింత మంచి కథలతో ప్రేక్షకులను అలరించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతానని చెప్పారు.

Sharwanand : స్టార్ట్ అవ్వకుండానే ఆగిపోయేలా ఉన్న శర్వా – శ్రీనువైట్ల మూవీ.. కారణం ఏంటంటే ?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus