Anil Ravipudi: అనిల్ రావిపూడి తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే పాపం అంటారు..!

సినీ పరిశ్రమలో 100శాతం సక్సెస్ రేటు ఉన్న డైరెక్టర్లు చాలా తక్కువ మందే ఉన్నారు. మొత్తం ఇండస్ట్రీని పరిగణలోకి తీసుకుంటే అలాంటి వాళ్లను వేళ్లమీదే లెక్క కట్టొచ్చు. ఇక మన టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఆ జాబితాలోకే వస్తాడు. కళ్యాణ్ రామ్ హీరోగా తన మొదటి సినిమా పటాస్ తో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు. ఆ తర్వాత మళ్లీ తాను కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకోలేదు.

బ్యాక్ టు బ్యాక్ ఎఫ్2, ఎఫ్ 3, సరిలేరు నీకెవ్వరు వంటి హిట్ సినిమాలను అందించాడు. వరుస సక్సెస్ లతో బ్రేకులు లేని బుల్డోజర్ గా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. తాజాగా అనిల్ రావిపూడి బాలయ్యతో భగవంత్‌ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీలో నందమూరి బాలకృష్ణతో పాటు కాజల్ అగర్వాల్ నటించారు. శ్రీలీల, అర్జున్ రాంపాల్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన భగవంత్‌ కేసరి సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది.

చాలా మంది సినిమా బాగుందనే అంటున్నారు. దీంతో బాలయ్య, అనిల్ ఖాతాలో మరో హిట్టు పడిందని టాక్. ఇదిలా ఉంటే భగవంత్ కేస‌రి మూవీకి దర్శకుడు అనిల్ రావిపూడి తీసుకున్న రెమ్యునరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది. ఫెయిల్యూర్ అనేదే లేని డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్.. భగవత్ కేసరికి భారీ రెమ్యునరేషన్ తీసుకున్నాడని అంటున్నారు.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం (Anil Ravipudi) అనిల్ ఈ మూవీ కోసం ఏకంగా రూ. 12 నుంచి 14 కోట్ల రెమ్యునరేష్ పుచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కనుక బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టితే ఆ రెమ్యునరేషన్ మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus