Anil Ravipudi: అనిల్ రావిపూడి రెమ్యునరేషన్ లెక్కలు వింటే షాకవ్వాల్సిందే!

సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఒకరు. ఇప్పటివరకు ఈయన చేసిన ఏ సినిమాలో కూడా ప్రేక్షకులను నిరాశపరచలేదని చెప్పాలి. అంతేకాకుండా నిర్మాతలకు కూడా మంచి లాభాలను తీసుకువచ్చాయి. ఇలా అపజయం ఎరుగని దర్శకులలో రాజమౌళి (SS Rajamouli)  తర్వాత అనిల్ రావిపూడి ఉంటారని చెప్పాలి. ఇటీవల ఈయన బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా నటించిన భగవంత్ కేసరి (Bhagavanth Kesari) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత ఈయన మరోసారి హీరో వెంకటేష్ తో (Venkatesh Daggubati) కలిసి కొత్త సినిమాని ప్రకటించారు. ఇదివరకు వీరిద్దరి కాంబినేషన్లో ఎఫ్2 (F2: Fun and Frustration) ఎఫ్ 3 (F3: Fun and Frustration) సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో దిల్ రాజు (Dil Raju) నిర్మాణంలో మరో సినిమా రాబోతుంది అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా సమాచారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ సినిమా కోసం అనిల్ రావిపూడి ఏకంగా దిల్ రాజు నుంచి 15 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అడ్వాన్స్ గా తీసుకున్నారని సమాచారం. ఇప్పటికే అనిల్ రావిపూడి దిల్ రాజు బ్యానర్ లో ఎన్నో హిట్ సినిమాలను చేశారు. ఈ క్రమంలోనే మరోసారి దిల్ రాజు బ్యానర్లో రాబోతున్న సినిమా కోసం భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ అందుకోబోతున్నారని సమాచారం.

ఇక ఈ సినిమాలో మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary ) హీరోయిన్గా నటించబోతున్నారు. ఈ సినిమా ఆగస్టు నెలలో షూటింగ్ పనులను ప్రారంభించుకోనుందని తెలుస్తుంది. మరి ఈసారి వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్నటువంటి ఈ సినిమా ఎలాంటి నేపథ్యంలో రాబోతుందనే విషయాలు గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలబడునున్నట్లు సమాచారం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus