Anil Ravipudi, Pawan Kalyan: నవ్వుల దర్శకుడి కథకు పవన్‌ ఓకే చెప్పారా!

పవన్‌ కల్యాణ్‌ సినిమాల లైనప్‌ బలంగా ఉంది. వరుసగా సినిమాలు చేసుకునేలా పవన్‌ ప్లాన్‌ చేసుకున్నాడు. అయితే ఈ లైనప్‌ మధ్యలోకి దిల్ రాజు వచ్చి సెట్‌ అవుతారా? అవుననే అనిపిస్తోంది తాజా రూమర్లు చూస్తుంటే. యాక్షన్‌ ప్లస్‌ ఎంటర్‌టైన్మెంట్‌ అంటే టాలీవుడ్‌లో వినిపించే పేర్లలో అనిల్‌ రావిపూడి ఒకరు. వరుసగా అలాంటి సినిమాలు చేస్తూ, విజయాలు అందుకుంటున్నాడు. ఆయన తాజాగా పవన్‌ కల్యాణ్‌కు ఓ పాయింట్‌ చెప్పారని టాక్‌.

అనిల్‌ రావిపూడి ప్రస్తుతం ‘ఎఫ్‌ 3’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఏ సినిమా చేస్తాడు అనే విషయంలో ఇంకా ఎక్కడా సరైన స్పష్టత రావడం లేదు. ఈ నేపథ్యంలో పవన్‌కు కథ చెప్పడం ఆసక్తి కలిగిస్తోంది. దిల్‌ రాజు నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతుంది అనే మాటలూ వినిపిస్తున్నాయి. ‘వకీల్‌ సాబ్‌’ తర్వాత పవన్‌తో దిల్‌ రాజు సోలో నిర్మాతగా ఓ సినిమా చేస్తాడని ఆ మధ్య అనుకున్నారు.

ఇప్పుడు ఆ పుకారే నిజమవుతుంది అంటున్నారు. అయితే మరి దిల్‌ రాజు, అనిల్‌ రావిపూడి డేట్స్‌ ఎప్పుడనేది చూడాలి. ఎందుకంటే ‘భీమ్లా నాయక్‌’, ‘హరి హర వీరమల్లు’, ‘భవదీయుడు భగత్‌ సింగ్‌’ సినిమాలు వరుసలో ఉన్నాయి. వీటి తర్వాత రామ్‌ తాళ్లూరి – సురేందర్‌ రెడ్డి; భగవాన్‌ – పుల్లారావుకి సినిమాలు చేయాలి. మరి ఇవయ్యాక దిల్‌ రాజు సినిమా ఉంటుందా? లేక మధ్యలోనే చేసేస్తారా అనేది చూడాలి.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus