దర్శకుడు అనిల్ రావిపూడి… సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ కి వీరాభిమాని. వెంకటేష్ ప్లస్ పాయింట్స్ అన్నీ అనిల్ రావిపూడికి బాగా తెలుసు. వెంకటేష్ అభిమానులకు కూడా ఏం కావాలో అందరికీ తెలుసు. అందుకే వీరి కాంబినేషన్లో వచ్చిన ‘ఎఫ్ 2’ ‘ఎఫ్ 3’ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలు సూపర్ హిట్లు అయ్యాయి.
ఈ మధ్య కాలంలో వెంకటేష్ ను ఇంత యాక్టివ్ గా ప్రజెంట్ చేసిన దర్శకుడు మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. అలాగే వెంకటేష్ కు కూడా అనిల్ రావిపూడిపై నమ్మకం ఎక్కువ. సురేష్ బాబు అప్రూవల్ లేనిదే ఏ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వని వెంకటేష్.. అనిల్ రావిపూడి సినిమాకి మాత్రం సురేష్ బాబు ప్రమేయం లేకుండానే ఓకే చెప్పేస్తూ ఉంటాడు. ఇప్పుడు వెంకీలో మరో పాజిటివ్ కోణాన్ని వాడుకోవడానికి అనిల్ రెడీ అయ్యాడు. అదేంటి అనుకుంటున్నారా?
చిరుతో చేస్తున్న సినిమాలో వెంకీని కూడా రంగంలోకి దించుతున్నాడు. దాదాపు 30 నిమిషాల పాటు వెంకీ- చిరు ఒకే స్క్రీన్ పై కనిపిస్తారట. వెంకీ ఎంట్రీతో థియేటర్లు షేక్ అయ్యే విధంగా అనిల్ ప్లాన్ చేశాడు. ఇక్కడితో అయిపోలేదు. బాలకృష్ణతో కూడా అనిల్ రావిపూడి ఒక సినిమా చేయబోతున్నాడు. దిల్ రాజు బ్యానర్లో ఈ సినిమా రూపొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది కూడా ‘భగవంత్ కేసరి’ లా ఔట్ అండ్ ఔట్ మాస్ ప్రాజెక్ట్ అని తెలుస్తుంది. ఇందులో వెంకటేష్ కూడా అత్యంత కీలక పాత్రలో కనిపించే అవకాశాలు ఉన్నాయట. ఈ ప్రాజెక్టులో మాత్రం వెంకీ సీరియస్ గా కనిపిస్తారని తెలుస్తుంది. అంతేకాదు ‘సంక్రాంతికి వస్తున్నాం’ సీక్వెల్ స్క్రిప్ట్ కూడా అనిల్ రెడీ చేస్తున్నాడు. అందులో కంప్లీట్ గా వెంకటేష్ హీరో. అది మేటర్