Anil Sunkara: సినిమా రిలీజ్ కాకముందే నెగిటివ్ రివ్యూస్ ఇచ్చారు :నిర్మాత అనిల్ సుంకర

మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘భోళా శంకర్’ రీసెంట్ గానే విడుదలై డిజాస్టర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ వద్ద చతికల పడిన సంగతి అందరికీ తెలిసిందే. రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి చేసిన సినిమాలలో బిగ్గెస్ట్ డిజాస్టర్ చిత్రం ఏమిటి అని అడిగితే ఎవరైనా నిన్న మొన్నటి వరకు ‘ఆచార్య’ పేరు చెప్పేవాళ్ళు. కానీ ఇక నుండి ‘భోళా శంకర్’ పేరు చెప్తారు. ఆ స్థాయిలో ఈ చిత్రం ఫ్లాప్ అయ్యింది.

మొదటి రోజు చిరంజీవి కి ఉన్న క్రేజ్ వల్ల టాక్ అంతలా నెగటివ్ గా వచ్చినా డీసెంట్ స్థాయి ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ రెండవ రోజు నుండి అనకాపల్లి నుండి అమెరికా వరకు ప్రతీ చోట డిజాస్టర్ ఆక్యుపెన్సీలను నమోదు చేసుకుంది ఈ చిత్రం, అలా మొదటి మూడు రోజులకు కలిపి 25 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టింది ఈ చిత్రం. ఈ సినిమా 8 ఏళ్ళ క్రితం విడుదలైన అజిత్ ‘వేదలమ్’ చిత్రానికి రీమేక్ అవ్వడం తో ప్రీ రిలీజ్ బిజినెస్ మెగాస్టార్ రేంజ్ కంటే తక్కువగా 80 కోట్ల రూపాయలకు మాత్రమే బిజినెస్ ని జరుపుకుంది.

కానీ ఇప్పుడు భారీ నష్టాలు తప్పేలాగా అనిపించడం లేదు. వాస్తవానికి సినిమా కి ఫ్లాప్ టాక్ ఒక రేంజ్ లో అయితే వచ్చింది కానీ , సినిమా కంటెంట్ ఆ టాక్ కి తగ్గ రేంజ్ లో మాత్రం లేదు. చాలా డీసెంట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని మనం చూడొచ్చు. కానీ చిరంజీవి అంటే మొదటి నుండి ఎంతో అసూయ ఉన్న పచ్చ మీడియా , ఈ సినిమా షోస్ ప్రారంభం కాకముందే డిజాస్టర్ అంటూ కథనాలు ప్రచురించింది.

దీంతో అది నిజమేనేమో అని చాలా మంది అనుకున్నారు. అలా సినిమా విడుదల కాకముందే మొదటి నుండి నెగటివ్ టాక్ ని ప్రచారం చేసిన కొన్ని పాపులర్ వెబ్ సైట్స్ కి లీగల్ గా నోటీసులు పంపబోతున్నాడు ఆ చిత్ర నిర్మాత (Anil Sunkara) అనిల్ సుంకర. త్వరలోనే ఆయన ఒక ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు సమాచారం.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus