Animal First Review: ‘యానిమల్’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న మరో ఇంటెన్స్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ ‘యానిమల్’. రణ్‌బీర్‌ కపూర్‌ సరసన రష్మిక మందన నటించింది. తండ్రీ కొడుకుల బంధం గురించి ఇప్పటికే మనం చాలా సినిమాల్లో చూశాం. అయితే ‘యానిమల్‌’ సినిమాలో డిఫెరెంట్ గా చూపించబోతున్నాడు సందీప్ రెడ్డి వంగా. టీజర్, ట్రైలర్స్ లో తాను ఏం చూపించబోతున్నది సాంపుల్ గా చూపించాడు.

టీజర్, ట్రైలర్స్.. ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్నాయి. ఈ మధ్య కాలంలో అత్యంత ప్రామిసింగ్ గా అనిపించిన ట్రైలర్ ఇది అని సోషల్ మీడియాలో డిస్కషన్స్ జరుగుతున్నాయి. డిసెంబర్ 1 న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. కాగా ప్రతి సినిమాను ముందుగా సెన్సార్ చేస్తున్నప్పుడు చూసేసాను అంటూ ఓ వ్యక్తి చెప్పుకుని తిరుగుతూ ఉంటాడు. ముఖ్యంగా అతను హిందీ సినిమాలకి ఎక్కువగా ఇలాంటి ఫేక్ రివ్యూలు చెబుతూ ఉంటాడు. అతను ఎవరో ఈ పాటికే మీకు ఆర్డమైపోయుంటుంది.

ఎస్.. అతనే ఉమైర్ సంధు. తాజాగా ఇతను (Animal) ‘యానిమల్’ సినిమాకి రివ్యూ ఇచ్చాడు. ఇందులో తండ్రీ కొడుకుల మధ్య సాగే ఎమోషనల్ డ్రామా అద్భుతంగా ఉందట. అంతేకాకుండా యాక్షన్ సీన్స్ ను కూడా దర్శకుడు బాగా డిజైన్ చేశాడట. నటీనటుల పెర్ఫార్మన్స్ లు అందరినీ ఆకట్టుకుంటాయట. అంతేకాకుండా అడల్ట్ కంటెంట్ సన్నివేశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయని, యూత్ ను అవి బాగా ఆకట్టుకుంటాయని రాసుకొచ్చాడు.

ఫైనల్ గా ఈ సినిమాకి అతను 4 /5 రేటింగ్ ఇవ్వడం గమనార్హం. ఉమైర్ సంధు గురించి తెలిసిన వారు అతని రివ్యూలని పెద్దగా పట్టించుకోరు. ఒకప్పుడు ఇతను పాజిటివ్ గా రివ్యూలు ఇచ్చేవాడు. కొద్దిరోజుల నుండి నెగిటివ్ గా రివ్యూలు ఇస్తున్నాడు. అంతేకాకుండా సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ గురించి బోలెడన్ని ఫేక్ న్యూస్ లు రాస్తున్నాడు. దీంతో చాలా మంది ఇతని పై కేసులు పెట్టడం కూడా జరిగింది.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus