Anirudh: మ్యూజిక్‌ డైరక్టర్‌ మ్యాజిక్‌ ఎప్పుడూ చేయాలా? లేకపోతే ఇంతేనా?

  • November 5, 2023 / 03:43 PM IST

‘జైలర్‌’ సినిమా విజయంలో సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్‌కు అగ్రతాంబూలం ఇచ్చారు. ఇటు ప్రేక్షకులు, అటు అభిమానులు, మరోవైపు చిత్ర నిర్మాణ సంస్థ కూడా అనిరుధ్‌ పనితీరు తెగ పొగిడేసింది. భారీ గిఫ్ట్‌లు, అదనపు పారితోషికాలు వచ్చేశాయి. ఆ తర్వాత సినిమా విజయంలో సంగీత దర్శకుడి పాత్ర అంటూ ఓ చర్చ కూడా సాగింది. ఆ సమయంలో అనిరుధ్‌ను తెగ పొగిడేశారు కూడా. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. మొన్న పొగిడిన వాళ్లే ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.

సినిమా ఇండస్ట్రీలో ఒక్కో వీకెండ్‌లో ఒక్కో హీరో పుడతారు అంటారు. అంతకుముందు వాళ్లు హీరోలు కారా అంటే.. ఆ వారానికి హీరోలు అని మా ఉద్దేశం. ఒక్కోసారి ఇద్దరు ముగ్గురు హీరోలు కూడా పుడతారు. అందులో సాంకేతిక నిపుణులు కూడా ఉంటారు. అలా ‘జైలర్‌’ సినిమా విడుదలైన వారం హీరోగా అనిరుధ్‌ పేరు కూడా వినిపించింది. ఆ సినిమాలో కీలక సన్నివేశాల్లో అనిరుధ్‌ నేపథ్య సంగీతం అంతలా అదిరిపోయింది. అయితే ఇటీవల వచ్చిన ‘ఇండియన్‌ 2’ ట్రైలర్‌తో మళ్లీ ప్రశ్నలు వినిపించాయి.

కమల్‌ హాసన్‌ – శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘ఇండియన్‌ 2’. ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో కంటెంట్‌ గురించి వస్తున్న ప్రశ్నలు ఒకవైపు అయితే, మరోవైపు సినిమా నేపథ్య సంగీతం గురించి వస్తున్న ప్రశ్నలు మరోవైపు. దీనికి ‘లియో’ సినిమా విషయంలో వచ్చిన డివైడ్‌ టాక్‌ కూడా కలసి అనిరుధ్‌ ఇలా చేస్తున్నారు ఏంటి? అనే ప్రశ్న మొదలైంది. ఆ స్థాయి మ్యూజిక్‌ ఇవ్వకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు కూడా.

‘ఇండియన్ 2’ టీజర్ వచ్చినప్పటి నుండి అనిరుధ్ (Anirudh) విషయంలో విమర్శల వస్తున్నాయి. సంగీతం అంత ఎగ్జైటింగ్‌గా లేకపోవడమే కారణం అని చెప్పొచ్చు. విజువల్స్‌లో కనిపించిన భారీతనం సంగీతంలో లేదు అనేది అభిమానుల వాదన. ‘భారతీయుడు’ సినిమాకు రెహమాన్ పాటలు, బ్యాగ్రౌండ్‌ స్కోర్ అసెట్ అయ్యాయి. ఇప్పుడు ఈ సినిమా విషయంలో అవి మైనస్‌ అవుతాయా అంటూ భయపడుతున్నారు. కానీ శంకర్‌ అలా కాకుండా చూసుకుంటారు అనే ధైర్యం కూడా ఉంది.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus