తమిళ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకడైన అనిరుధ్ తెలుగు చిత్రసీమలోకి పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. నేడు దర్శకుడు త్రివిక్రమ్ పుట్టినరోజును పురస్కరించుకొని సినిమాలోని ఫస్ట్ సింగిల్ “బయటకొచ్చి చూస్తే టైమేమో 3 ఓ క్లాక్”ను రిలీజ్ చేశారు. అర్ధరాత్రి 12 గంటలకి రిలీజైన ఈ మెలోడీ ఇంస్టంట్ హిట్ అయిపోయింది. ఇప్పుడు అందరి మొబైల్స్ లోనూ, నోళ్లలోనూ వినిపిస్తున్న పాట ఇదే.
శ్రీమణి సాహిత్యం, అనిరుధ్ మ్యూజిక్ కి శ్రోతలు ఫిదా అన్నారు. చెప్పుకోదగ్గ స్థాయిలో రికార్డ్ వ్యూస్ అండ్ లైక్స్ వంటివి రాకపోయినా ఈమధ్యకాలంలో అందరికీ విపరీతంగా నచ్చిన పాట ఇదేనని ఎంచక్కా చెప్పొచ్చు. సో, టాలీవుడ్ కి అనిరుధ్ ఎంట్రీ అదిరిందని చెప్పుకోవచ్చు. ఇకపోతే.. సినిమాలో మొత్తం అయిదు పాటలుండగా.. రెండు మెలోడీస్ అంట, ఇంకో మాస్ నెంబర్ మాత్రం అభిమానులు చొక్కాలు చింపుకొనే స్థాయిలో ఉంటుందని, ఈ పాటను పవన్ కళ్యాణ్ చేత పాడించేందుకు అనిరుధ్ ప్లాన్ చేస్తున్నాడని చిత్ర బృందం సమాచారం.
ఇక రాత్రి నుంచి పవన్ కళ్యాణ్ అభిమానులను నిద్రపోనివ్వకుండా చేస్తున్న “బయటకొచ్చి చూస్తే టైమేమో 3 ఓ క్లాక్” లిరిక్స్ మీకోసం..
బైటికొచ్చి చూస్తే టైమ్ ఏమో 3 ఓ క్లాక్
ఇంటికెళ్లే 12b రూట్ మొత్తం రోడ్డు బ్లాక్
ఓయ్ నీ చేతికున్న బ్యాంగిల్సే.. తాళమేసే నా శ్యాండిల్సే
వాక్ వే లో చూస్తే పువ్వుల రెక్కలు ఫుల్లుగా కప్పేసే
కార్నర్ లో కాఫీ షాప్.. వేడివేడిగా విజిలేసే.. బస్ కిటికీ దగ్గర కాలేజ్ స్టూడెంట్ ఫోన్ లో మోగే..
ఎఫ్.ఎంలో ఎవరో పాడితే ఒళ్ళంతా ఎందుకో ఊగెనే..
ఆపిల్ పండులా సూరీడే.. ఏరోప్లేనులా నా గుండె తేలిందే గాలిలో మబ్బులా.. జారిందే నేలపై నీడలా.. ముళ్లే గుచ్చెనే సడన్ గా.. చల్లగాలే విలన్ లా
నీ పక్కనున్న వేళ కారు హార్న్ కూడా క్లాసికల్లు మ్యూజిక్కా
ఈ మండుటెండ కూడా ఏసీ జల్లుతోంది నీ నవ్వులోని మ్యాజిక్కా ??
ట్యాక్సీ హైర్ చేసి నువ్వూ బేరమాడుతుంటే క్యూటుగుంది బేసిగ్గా..
బ్రేక్స్ వేసినప్పుడల్లా నీ బుగ్గ నన్ను తాకి.. సారి చెప్పే నాజూగ్గా
నువ్వున్న కిటికీ ఏ వైపో వెతికి వాట్సాపు చేస్తావా..
మబ్బుల్ని కదిపి మొహమాట పెట్టి చంద్రుడ్ని తెస్తాగా..