Anirudh Ravichander: క్రేజీ కాంబో.. వర్కౌట్ అయితే మాస్ జాతరే.!

  • November 8, 2023 / 09:38 PM IST

అనిరుధ్.. తమిళంలో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడు. ప్రస్తుతం అతను ఇండియన్ 2 వంటి బడా ప్రాజెక్టులకి పనిచేస్తున్నాడు. ఇటీవల అతను చేసిన ‘జవాన్’ ‘జైలర్’ వంటి సినిమాలు ఎంత పెద్ద సక్సెస్ అయ్యాయో అందరికీ తెలుసు. అందుకే ఇప్పుడు పెద్ద సినిమా అంటే అనిరుధ్ సంగీతం ఉండాలని దర్శకనిర్మాతలు పట్టుబడుతున్నారు. కానీ అనిరుధ్ మాత్రం ఎవ్వరికీ దొరకడం లేదు. తన వద్దకు వచ్చిన అందరి దర్శకులకి లేదా నిర్మాతలకి అనిరుధ్ ఓకే చెప్పడు.

అతనికి నచ్చిన కథకే మ్యూజిక్ చేస్తాడు. వాటికి కూడా అతను చాలా కండిషన్స్ పెడతాడట. అందుకే టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ అనిరుధ్ వద్దకి ఎక్కువగా పోవడం లేదు. ‘దేవర ‘ సినిమాకి అనిరుధ్ ఇంకా ఒక్క ట్యూన్ కూడా ఇచ్చింది లేదు. అయినా ఎన్టీఆర్.. అనిరుధ్ కావాలని పట్టుబడుతున్నాడట. మరోపక్క బాలయ్య – బాబీ కాంబినేషన్లో రూపొందే మూవీ కోసం కూడా అనిరుధ్ ని సంపాదిస్తున్నాడట నిర్మాత నాగ వంశీ.

కానీ అనిరుధ్ (Anirudh Ravichander) దొరకడం లేదు అని టాక్. గతంలో ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ బ్యానర్లో ‘అజ్ఞాతవాసి’ అనే సినిమాకి మ్యూజిక్ అందించాడు అనిరుధ్. ఆ తర్వాత ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ లో రూపొందిన ‘జెర్సీ’ సినిమాకి కూడా సంగీతం అందించాడు. ఆ చనువుతోనే ఇప్పుడు బాలయ్య సినిమా కోసం అనిరుధ్ ను రంగంలోకి దించాలని నాగవంశీ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. తమన్ – బాలయ్య కాంబోలో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చాయి. మళ్ళీ తమన్ ఎందుకు అనేది అతని ఉద్దేశం కావచ్చు.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus