యూ టర్న్ కోసం ప్రచార గీతాన్ని రూపొందిస్తున్న అనిరుధ్

టాలీవుడ్ క్యూట్ బ్యూటీ సమంత చేసిన తాజాగా చిత్రం “యూ టర్న్”. కన్నడలో హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రీమేక్ చేస్తున్నారు. పవన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సమంత జర్నలిస్ట్ గా కనిపించనుంది. భూమిక, అది పినిశెట్టి , రాహుల్ రవీంద్రన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ తెలుగు రాష్ట్రాల హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయి. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ శివమ్ సెల్యులాయిడ్ ఈ హక్కులను దక్కించుకుంది. పూర్ణ చంద్ర తేజస్వి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వినాయకచవితి కానుకగా సెప్టెంబర్ 13న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకం ఫై శ్రీనివాస్ చిట్టూరి, రాంబాబు బండారు సంయుక్తంగా నిర్మిస్తున్న మూవీకి ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి.

ఈ సినిమా కోసం యువ సంగీత దర్శకుడు అనిరుధ్ తో ప్రచార గీతాన్ని రూపొందిస్తున్నారు. అజ్ఞాతవాసి సినిమా ద్వారా తెలుగువారికి పరిచయమైన ఇతను నయనతార నటించిన “కొలమావు కోకిల(కో కో కోకిల)” చిత్రానికి మ్యూజిక్ వీడియోని రూపొందించి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో సక్సస్ అయ్యారు. ఇప్పుడు ఈచిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అదే విధంగా యూ టర్న్ కి ఓ ప్రచార గీతాన్ని రూపొందిస్తున్నారు. ఈ మ్యూజిక్ వీడియోలో అనిరుధ్ కనిపించనున్నారు. ఇందులో ట్రాక్ ను కూడా ఆయనే పాడనున్నారు. కానీ ఇది సినిమాలో ఉండదు. మరి ఈ ప్రమోషనల్ వీడియో సాంగ్ సినిమా విజయానికి ఎంత వరకు ఉపయోగపడుతుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus