లెస్బియన్ గా మారిన తెలుగమ్మాయి!

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ కంటెంట్ మీద దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. రీజనల్ గా కూడా గుర్తింపు తెచ్చుకోవడానికి సౌత్ భాషలపై ఫోకస్ పెట్టింది. ఇంట్లో భాగంగా తమిళంలో ఓ ఆసక్తికర సినిమాను సిద్ధం చేసింది. నాలుగు విభిన్న కథలతో కూడి ఉన్న ‘పావ కథైగల్’ అనే సినిమాను డిసెంబర్ 18న విడుదల చేయనున్నారు. అయితే ఈ సినిమా ట్రైలర్ ని రీసెంట్ గా విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో నాలుగు కథలకు సంబంధించిన సన్నివేశాలను చూపించారు. ఒక కథలో సాయి పల్లవి, ప్రకాష్ రాజ్ తండ్రీకూతుళ్లుగా కనిపించారు.

రెండో కథలో గౌతమ్ మీనన్, సిమ్రాన్ భార్యభర్తలుగా నటిస్తున్నారు. ఇక మూడో కథలో హీరోయిన్ అంజలి మరో అమ్మాయితో ప్రేమలో పడే సన్నివేశాలను చూపించారు. అంటే.. ఈ సినిమాలో అంజలి లెస్బియన్ గా నటించిందన్నమాట. కులం, పరువుకి ప్రాధాన్యతనిచ్చే అంజలి తండ్రి ఆమె లెస్బియన్ ప్రేమకి ఒప్పుకుంటాడా అనేది ఆసక్తికరం. తెలుగమ్మాయి లెస్బియన్ గా నటించాలనుకోవడం డేరింగ్ స్టెప్ అనే చెప్పాలి. సరికొత్త పాత్రలతో గుర్తింపు తెచ్చుకోవాలని భావిస్తోన్న అంజలి ఇష్టపడి ఈ సినిమా ఒప్పుకుందట.

మరి ఈ లెస్బియన్ క్యారెక్టర్ తనకు ఎలాంటి గుర్తింపు తీసుకొస్తుందో చూడాలి. ఇక నాల్గో కథలో ముస్లిం అబ్బాయి, హిందు అమ్మాయి మధ్య నడిచే ప్రేమాయణం అని తెలుస్తోంది. ఈ నాలుగు కథలను ప్రముఖ దర్శకులు సుధ కొంగర, వెట్రిమారన్, గౌతమ్ మీనన్, విఘ్నేష్ శివన్ డైరెక్ట్ చేస్తున్నారు. మరి ఈ నాలుగు కథల సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి!


ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus