తెలుగమ్మాయి అంజలి.. హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసింది. టాలీవుడ్ లో కంటే తమిళనాట ఈ ముద్దుగుమ్మ వరుస అవకాశాలు దక్కించుకుంది. ఈమె ఇండస్ట్రీకి వచ్చి పదిహేనేళ్లు అవుతున్నా.. ఇప్పటికీ అవకాశాలు దక్కించుకుంటూనే ఉంది. పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇస్తోన్న ‘వకీల్ సాబ్’ సినిమా ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో అంజలి కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన ఆమె కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది.
సినిమా సంగతులతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంది. తన ప్రేమ విషయంపై స్పందించింది. తాను ప్రేమలో పడలేదని చెబితే అది అబద్ధమవుతుందని చెప్పింది. కానీ తన ప్రేమ వర్కవుట్ కాలేదని.. సక్సెస్ అయి ఉంటే తన ప్రియుడ్ని పరిచయం చేసేదాన్ని అని చెప్పుకొచ్చింది. ప్రేమలో ఫెయిల్ అవ్వడంతో ఎంతో ఆవేదన చెందానని.. ఏ ఆడపిల్లైనా ఆ బాధను తట్టుకోవడం చాలా కష్టమని తెలిపింది. అమ్మ సపోర్ట్ తో ఆ బాధ నుండి త్వరగానే కోలుకున్నట్లు చెప్పింది.
తాను మెంటల్ గా చాలా స్ట్రాంగ్ అని చెప్పుకొచ్చింది. అమ్మ ఇచ్చిన ధైర్యంతో సంతోషంగా కెరీర్ కొనసాగిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. తన పెళ్లి గురించి మీడియాలో రకరకాల ప్రచారం జరిగిందని.. తనకు ఏకంగా ఐదు సార్లు పెళ్లి చేశారని నవ్వుతూ చెప్పింది. పెళ్లిళ్లతో ఆగలేదని.. పిల్లలు కూడా పుట్టారని రాశారని చెప్పుకొచ్చింది. దయచేసి తన భర్త, పిల్లలని చూపించాలని.. అప్పుడు ఆనందిస్తానని వెటకారంగా మీడియాపై కౌంటర్ వేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఐదు చిత్రాల్లో నటిస్తోంది.