అనబెల్ సేతుపతి సినిమా రివ్యూ & రేటింగ్!

  • September 19, 2021 / 08:38 AM IST

విజయ్ సేతుపతి, తాప్సీ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం “అనబెల్ సేతుపతి”. హారర్ కామెడీ జోనర్ లో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల అదృష్టం బాగుండి ఒటీటీలో విడుదలైంది. కనీసం ఒటీటీ ఆడియన్స్ ను అయినా ఈ సినిమా అలరించగలిగిందో లేదో చూడాలి.

కథ: రుద్ర (తాప్సీ) అండ్ ఫ్యామిలీ మాంచి దొంగలు. నలుగురు కలిసి దొంగతనాలు చేస్తూ హ్యాపీగా బ్రతికేస్తుంటారు. అనుకోకుండా ఓ రాజమహల్ లోకి ఎంటర్ అవుతారు. ఆల్రెడీ అందులో ఓ దెయ్యం ఫ్యామిలీ నివసిస్తుంటుంది. ఆ దెయ్యాల అల్లరిని తట్టుకొని రుద్ర & కో ఎలా నిలబడ్డారు? ఇంతకీ ఆ దెయ్యాల కుటుంబం ఆ కోటలో ఏం చేస్తుంది ? అసలు ఆ కోట వెనుక కథ ఏమిటి? వంటి ప్రశ్నలకు చాలా సిల్లీగా చెప్పిన సమాధానాలే “అనబెల్ సేతుపతి” సినిమా.

నటీనటుల పనితీరు: సేతుపతి వరుసబెట్టి సినిమాలు చేస్తున్నందుకు ఆనందపడాలో.. ఇలాంటి క్యారెక్టర్ లేని రోల్స్ ప్లే చేస్తున్నందుకు బాధపడాలో అర్ధం కావడం లేదు. ఒక నటుడిగా అన్నీ రకాల పాత్రలు చేయాలనుకోవడం మంచిదే కానీ.. మరీ ఇలా కనీస స్థాయి కథ-కథనం లేని సినిమాలు చేయడం అనేది మాత్రం అతడి కెరీర్ కు కూడా రిస్కే. ఆ విషయాన్ని అతడు ఎంత త్వరగా రియలైజ్ అయితే.. అంత బెటర్.

నటిగా తాప్సీ నుంచి పాత్రకు పెర్ఫార్మెన్స్ రాబట్టుకోవడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. తాప్సీ ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్న భావన ఎక్కడా కలగలేదు. ఏదో షాట్ బ్రేక్ లో అలా సరదాగా గడిపేసిన భావన.

జగపతిబాబు మరోసారి ఎక్స్ ప్రెషన్స్ తో సీరియల్ ఆర్టిస్ట్ గా మిగిలిపోయాడు. రాధిక ఓవర్ యాక్షన్ తట్టుకోవడం కష్టమే. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ లు నవ్వించడానికి ఏదో ప్రయత్నించారు కానీ.. అవి విఫలమయ్యాయి.

సాంకేతికవర్గం పనితీరు: సినిమా మొత్తానికి ఒక్కటంటే ఒక్క టెక్నికల్ యాస్పెక్ట్ గురించి కూడా డిస్కస్ చేసే రేంజ్ లో లేవంటే.. అర్ధం చేసుకోవచ్చు సినిమా ఎలా ఉందో. ఒక హారర్ కామెడీ సినిమాను మరీ ఇంత సిల్లీగా తీయాలా? అనిపిస్తుంది. కథలో కొత్తదనం లేదు అని ట్రైలర్ లోనే చెప్పిన దర్శకుడు.. కనీసం కథనంలోనూ కొత్తదనాన్ని చూపడంలో విఫలమయ్యాడు. గ్రాఫిక్స్ మరీ బీలెవల్ సినిమాలా ఉండడం గమనార్హం. అన్నిటికీ మించి సినిమాను ముగించిన విధానం, ఏదో పెద్ద ట్విస్ట్ లా ప్రీఇంటర్వెల్ వరకూ సినిమాను సాగదీసిన తీరుకి థియేటర్లలో అయితే.. ప్రేక్షకులు వాకౌట్ చేసేవారు.

విశ్లేషణ: మరీ ఖాళీగా ఉండి.. టైమ్ వేస్ట్ అయినా పర్లేదు అనుకుని, విజయ్ సేతుపతి, తాప్సీలకు వీరాభిమాని అయితే తప్ప “అనబెల్ సేతుపతి” చిత్రాన్ని ఫార్వార్డ్ చేసుకుంటూ కూడా చూడడం చాలా కష్టం. ఇక మీ ఇష్టం!

రేటింగ్: 1/5

Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus