సంతోష్ శోభన్ హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ ‘అన్నీ మంచి శకునములే’. ‘అల మొదలైంది’ ‘ఓ బేబీ’ వంటి హిట్ చిత్రాలను డైరెక్ట్ చేసిన నందినీ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం జరిగింది. ‘స్వప్న సినిమా’ ‘మిత్రవింద మూవీస్’ బ్యానర్ పై ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మిక్కీ జె మేయర్ సంగీత దర్శకుడు. టీజర్, ట్రైలర్ లకు మంచి రెస్పాన్స్ లభించింది. ఇక వైజయంతి మూవీస్, స్వప్న సినిమా..
బ్యానర్లపై రూపొందిన ‘మహానటి’ ‘జాతి రత్నాలు’ ‘సీతా రామం’ వంటి చిత్రాలు సూపర్ హిట్ అవ్వడంతో ‘అన్నీ మంచి శకునములే’ చిత్రం కూడా సక్సెస్ అవుతుందని అంతా భావిస్తున్నారు. అయినప్పటికీ ‘వైజయంతి మూవీస్’ సంస్థ ఈ చిత్రాన్ని చాలా చోట్ల చేసుకున్నారు. ఒకసారి ఈ చిత్రం థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్ ను గమనిస్తే :
నైజాం | 1.20 cr |
సీడెడ్ | 0.55 cr |
ఉత్తరాంధ్ర | 0.60 cr |
ఈస్ట్ | 0.32 cr |
వెస్ట్ | 0.30 cr |
గుంటూరు | 0.40 cr |
కృష్ణా | 0.45 cr |
నెల్లూరు | 0.20 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 4.02 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.20 cr |
ఓవర్సీస్ | 0.40 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 4.62 cr (షేర్) |
‘అన్నీ మంచి శకునములే’ (Anni Manchi Sakunamule) చిత్రానికి రూ.4.62 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. సంతోష్ శోభన్ సినిమాలు ఇప్పటివరకు ఇంత కలెక్ట్ చేసిన సందర్భాలు లేవు. మరి ఈ మూవీ అయినా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను ఛేజ్ చేసి ఆ లోటుని తీరుస్తుందో లేదో చూడాలి.
కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!
భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!