Chiranjeevi: అప్పుడెప్పుడో అనుకున్న దర్శకుడితో చిరు నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌.. ఎవరంటే?

సెకండ్‌ ఇన్నింగ్స్‌లో ఆ మధ్య వరుస సినిమాలు ఓకే చేసి వావ్‌ అనిపించిన చిరంజీవి.. ఇటీవల కాలంలో కాస్త స్లో అయ్యారేమో అనుకున్నారంతా. ‘భోళా శంకర్‌’ సినిమా ఒకటే సెట్స్‌ మీద ఉండటం.. కొత్త సినిమాలేవీ ప్రకటించకపోవడంతో ఇదేంటి చిరంజీవి జోరు తగ్గిందా అనుకున్నారంతా. అయితే అదంతా చిన్న గ్యాప్‌.. మళ్లీ గట్టిగా అనౌన్స్‌మెంట్లు ఉంటాయని చిరు సన్నిహిత వర్గాలు చెప్పాయి. అందులో భాగంగా ఓ సినిమా ప్రకటన అనధికారికంగా బయటకు వస్తే..

ఇప్పుడు మరో సినిమా ఓకే అయ్యింది అంటున్నారు. ఈసారి కూడా యువ దర్శకుడే. అక్కినేని హీరోల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కల్యాణ్‌ కృష్ణ కురసాల డైరక్షన్‌లో (Chiranjeevi) చిరంజీవి నటించబోతున్నారట. ‘సోగ్గాడే చిన్ని నాయిన‌’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’, ‘బంగార్రాజు’ చిత్రాల‌తో క‌ల్యాణ్ కృష్ణ‌ తనేంటో నిరూపించుకున్నారు. విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో అదిరిపోయే ఫ్యామిలీ సినిమాలు తీయడం ఆయన స్టైల్‌. ఇప్పుడు చిరంజీవికి కూడా ఇంచుమించు అలాంటి సినిమానే చేస్తారు అని సమాచారం.

‘బంగార్రాజు’ త‌ర‌వాత చాలా రోజులుగా ప్రాజెక్ట్‌ ఓకే చేసుకోని కల్యాణ్‌ కృష్ణ.. ఇప్పుడు వేరే రైటర్‌ కథతో సినిమా చేస్తున్నార. రైట‌ర్‌ ప్ర‌స‌న్న‌కుమార్ బెజ‌వాడ రాసిన క‌థను చిరంజీవికి నెరేట్‌ చేసి.. ఫ‌స్ట్ సిట్టింగ్‌లోనే ఓకే చేయించుకున్నారని స‌మాచారం. అయితే చిరు – కల్యాణ్‌ కృష్ణ ఇప్పటికే ఓ సినిమా చేయాల్సింది. ‘సోగ్గాడే చిన్ని నాయిన’ సమయంలోనే మెగా ఫ్యామిలీలో ఓ సినిమా ఉంటుందని వార్తలొచ్చాయి. అయితే అప్పుడు ఓకే అవ్వలేదు. ఎట్టకేలకు ఇప్పుడు ఇద్దరూ కలసి సినిమా చేస్తున్నారు.

త్వరలోనే ఈ సినిమా అనౌన్స్‌ ఉంటుంది అంటున్నారు. ఆగ‌స్టు నుండి వ‌శిష్ట చిత్రం స్టార్ట్‌ చేస్తారట. అలాగే క‌ల్యాణ్ కృష్ణ సినిమాను పారలల్‌గా ప‌ట్టాలెక్కిస్తార‌ని తెలుస్తోంది. వెంకీ కుడుమల సినిమాను చిరంజీవి హోల్డ్‌లో పెట్టారు. పూరి జగన్నాథ్‌తో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇప్పుడు వశిష్ట, కల్యాణ్‌ కృష్ణ సినిమాలు ఓకే అయ్యాయి. అలా మళ్లీ చిరు యువ దర్శకులతోనే సినిమా చేయబోతున్నారు. ఆయనకు కథ మీద నమ్మకం కుదిరితే సీనియర్‌, జూనియర్‌ అని లెక్కలు చూడరు అనే విషయం మరోసారి నిరూపితమైంది అని చెప్పాలి.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus