F3 Movie: ఎఫ్ 3 సినిమాకు మరో కన్ఫ్యూజన్!

కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కించిన ఫస్ట్ మూవీ పటాస్ తో సూపర్ హిట్ కొట్టిన యువ దర్శకుడు అనిల్ రావిపూడి, ఆ తరువాత సాయిధరమ్ తేజ్ తో సుప్రీం, అలానే రవితేజ తో రాజా ది గ్రేట్, వెంకటేష్ వరుణ్ తేజ్ లతో ఎఫ్ 2, ఇటీవల మహేష్ బాబు తో సరిలేరు నీకెవ్వరు వంటి సినిమాలతో వరుసగా విజయాలు అందుకుంటూ సక్సెస్ఫుల్ గా కొనసాగుతున్నారు. ఇక ప్రస్తుతం అనిల్ రావిపూడి తీస్తున్న సినిమా ఎఫ్3. సూపర్ హిట్ మూవీ ఎఫ్2 కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో కూడా వెంకటేష్,

వరుణ్ తేజ్ హీరోలుగా యాక్ట్ చేస్తుండగా తమన్నా, మెహ్రీన్ కథానాయికలుగా నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు. మొదటి భాగం కంటే కూడా మరింత ఫన్, ఎంటర్టైన్మెంట్ అంశాలు ఉండేలా దర్శకుడు అనిల్ ఈ సినిమా స్టోరీ ఎంతో అద్భుతంగా రాసుకున్నారని, ఇక ఇప్పటికే చాలా వరకు షూట్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా మేకర్స్ విడుదల చేయనున్నారని కొద్దిరోజుల నుండి ఒక వార్త మీడియా సర్కిల్స్ లో వైరల్ అవుతోంది.

అయితే ఈ సినిమా డిసెంబర్ ఆఖరి వారంలో రానుందని కూడా మరొక వార్త కూడా ప్రచారం అవుతుండడంతో అసలు ఈ మూవీ ఎప్పుడు విడుదలవుతుంది అనే విషయమై అందరిలో సందిగ్ధం ఏర్పడింది. అయితే ఇప్పటికే సంక్రాంతి సమయానికి మహేష్, పవన్, ప్రభాస్ ల సినిమాలు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేయడంతో తమ సినిమాని ఒకింత ముందే డిసెంబర్ లో తీసుకువచ్చేలా ఎఫ్ 3 యూనిట్ ప్లాన్ చేస్తోందట. అయితే దీనిపై అధికారికంగా న్యూస్ మాత్రం వెల్లడి కావాల్సి ఉంది.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus