Sharwanand: శర్వానంద్‌ సెంటిమెంట్‌ ఇదేనా? హిట్‌ కోసం దానినే నమ్మాడా?

  • March 7, 2024 / 03:27 PM IST

సినిమా వాళ్లు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా చాలా సెంటిమెంట్లు ఫాలో అవుతారు. ఛస్‌.. బయట జనాలు ఫాలో అవ్వరా అంటే… సినిమా వాళ్లు ఫాలో అయితే విషయం కదా. ఇప్పుడు ఇలాంటి సెంటిమెంట్‌తోనే ( Sharwanand) శర్వానంద్‌ తన సినిమాకు పేరు పెట్టారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. పుట్టిన రోజు సందర్భంగా సినిమా అనౌన్స్‌ చేశారు కానీ.. టైటిల్‌ చెప్పలేదు. అయితే సినిమా టీమ్‌లో జరుగుతున్న చర్చ ప్రకారం అయితే టైటిల్‌ దాదాపు ఫిక్స్‌ అయిపోయిందట.

శర్వానంద్‌ కెరీర్‌ను భారీ మలుపు తిప్పిన సినిమా అంటే (Run Raja Run) ‘రన్‌ రాజా రన్‌’ అని చెప్పాలి. సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న సమయంలో పెద్దగా అంచనాలు లేకుండా వచ్చి అదిరిపోయే విజయం అందుకుంది. ఆ తర్వాత ‘రాజా’ సెంటిమెంట్ను కొనసాగిస్తూ (Express Raja) ‘ఎక్స్‌ప్రెస్‌ రాజా’ అనే సినిమా చేశాడు శర్వా. అది కూడా మంచి విజయమే అందుకుంది. ఇప్పుడు మరోసారి ‘రాజా’ సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ కొత్త సినిమాకు ‘రేస్‌ రాజా’ అనే పేరు పెడుతున్నారని టాక్‌. త్వరలోనే క్లారిటీ ఇస్తారట.

టాలీవుడ్‌లో స్పోర్ట్స్ డ్రామాల సీజ‌న్ మ‌ళ్లీ మొద‌లైన‌ట్టే అనిపిస్తోంది. (Ram Charan) రామ్ చ‌ర‌ణ్ – బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కనున్న సినిమా క్రీడా నేప‌థ్యంలోనే ఉంటుంది. ఇప్పుడు శ‌ర్వానంద్ కూడా ఆట‌గాడిలా మారిపోయాడు. యూవీ క్రియేష‌న్స్ బ్యానర్‌లో శర్వా ఓ సినిమా చేయబోతున్నాడు. మాళ‌వికా నాయ‌ర్ (Malavika Nair) క‌థానాయిక‌గా నటిస్తున్న ఈ సినిమాకు అభిలాష్ ద‌ర్శ‌కుడు. ఇందులో శ‌ర్వా బైక్ రేస‌ర్‌గా కనిపిస్తాడట. 1990 నుండి 2020 మ‌ధ్య జ‌రిగే క‌థ ఇదట. ఈ సినిమకాఏ ‘రేస్‌ రాజా’ అనే పేరు అనుకుంటున్నారట.

ఇక శర్వా 35వ సినిమా ‘మ‌న‌మే’ (Manamey) అనే టైటిల్ ఫిక్స్ చేశారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీ‌రామ్ ఆదిత్య (Sriram Adittya) ద‌ర్శ‌కుడు. అలాగే ‘సామజవరగమన’ (Samajavaragamana) దర్శకుడు రామ్ అబ్బరాజుతో (Ram Abbaraju) మరో సినిమా ఉంటుందట. 2022లో ‘ఒకే ఒక్క జీవితం’ (Oke Oka Jeevitham) సినిమా చేసిన శర్వ… రెండేళ్ల గ్యాప్‌ తర్వాత వరుస సినిమాలతో రాబోతున్నాడన్నమాట.

ఇంటర్వ్యూ : ‘గామి’గురించి డైరెక్టర్ విద్యాధర్ కాగిత చెప్పిన ఆసక్తికర విషయాలు.!

ఇంటర్వ్యూ : ‘భీమా’ గురించి గోపీచంద్ చెప్పిన ఆసక్తికర విషయాలు
రోడ్డుపై యాంకర్ ఝాన్సీ చెత్త సేకరించడానికి కారణాలివేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus