Manchu Vishnu: ఈ ఆరోపణలపై మంచు విష్ణు స్పందిస్తారా?

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సమయంలో తలెత్తిన వివాదాల గురించి సోషల్ మీడియా వేదికగా జోరుగా చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు విష్ణు ప్యానల్ పై, విష్ణు ప్యానల్ సభ్యులు ప్రకాష్ రాజ్ ప్యానల్ పై విమర్శలు చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు. ఎన్నికల తర్వాత సీసీ టీవీ ఫుటేజ్ అంటూ ప్రకాష్ రాజ్ కొన్నిరోజుల పాటు హడావిడి చేసినా ఆ తర్వాత సైలెంట్ అయ్యారు.

అయితే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు సంబంధించి తాజాగా మరో వివాదం తలెత్తింది. ‘మా’ ఆఫీస్ కు ఎప్పుడూ తాళాలు వేసి ఉంటాయని అసోసియేషన్ లోని కొంతమంది సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. కార్యవర్గ సభ్యులు ఆఫీస్ కు రావడం లేదని కొందరు ఆరోపిస్తున్నారు. పింఛన్ తీసుకోవాలని అనుకున్నా, సమస్యలు చెప్పుకోవాలని అనుకున్నా ప్రతిసారి ఆఫీస్ కు లాక్ వేసి ఉండటం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని కొంతమంది సభ్యులు కామెంట్లు చేస్తున్నారు.

ఇది చిన్న సమస్యే అయినా విష్ణు వెంటనే స్పందించి వివరణ ఇస్తే బాగుంటుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రకాష్ రాజ్ ప్యానల్ ఈ సమస్యను లేవనెత్తితే మంచు విష్ణు వర్గంకు ఇబ్బంది ఎదురవుతుంది. ప్రస్తుతం విష్ణు శ్రీనువైట్ల డైరెక్షన్ లో ఢీ అండ్ ఢీ సినిమాలో నటిస్తున్నారు. విష్ణు గత సినిమా మోసగాళ్లు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. ఒకవైపు అసోసియేషన్ పనులను చూసుకుంటూ మరోవైపు సినిమాలతో విష్ణు బిజీగా ఉన్నారు.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus