Nagarjuna: నాగార్జున కొత్త సినిమా కోసం మళ్లీ ‘సోగ్గాడే’ కాన్సెప్ట్‌

  • February 4, 2023 / 04:47 PM IST

నాగార్జున అంటే మన్మథుడు, యాక్షన్‌లో కింగ్‌, కామెడీ అదరగొడతాడు అని అంటుంటారు. అలాంటి క్లాస్‌ పాత్రలే కాదు.. మాస్‌ పాత్రలు కూడా బాగానే చేయగలుగుతారు అనే విషయమూ తెలిసిందే. ఇటీవల కాలంలో నాగ్‌ అన్ని రకాల సినిమాలు చేస్తున్నా.. విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌ ఉన్న మాస్‌ సినిమాలు అయితే ఫ్యాన్స్‌ను, ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో నాగ్‌ తన తర్వాతి సినిమా విషయంలో మళ్లీ విలేజ్‌కి వెళ్లాలని ఫిక్స్‌ అయ్యారు అంటున్నారు.

దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేసి… కొత్త టాలెంట్‌ను ప్రోత్సాహించే వారిలో నాగార్జున ఎప్పుడూ ముందుంటారు. ఈ క్రమంలో ఆయన తాజాగా రైటర్ ప్రసన్న కుమార్‌ను దర్శకుడిగా ప్రమోట్‌ చేస్తున్నారు. త్రినాథరావు నక్కినతో కలసి ఇన్నాళ్లూ సినిమాలు చేసిన ప్రసన్న త్వరలో దర్శకుడు కాబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి త్వరలో నాగార్జున అధికారికంగా ప్రకటిస్తారు. దీంతో ఒకపక్క స్క్రిప్ట్ వర్క్‌ చూస్తూనే.. మరోవైపు లొకేషన్స్ వేటలో పడ్డారట ప్రసన్న కుమార్‌.

మొన్నీమధ్య అంటే సంక్రాంతి సీజన్‌లో కోనసీమ ప్రాంతమంతా ఓ చుట్టుచుట్టేశారట. తన తర్వాతి సినిమా ఆ ప్రాంతం నేపథ్యంలో ఉంటుందని సన్నిహితు దగ్గర అన్నారట. దీంతో నాగార్జున నెక్స్ట్‌ సినిమా పక్కా మాస్‌ విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌ అని తేలిపోయింది. అయితే మొత్తం సీన్స్‌ అక్కడే విలేజ్‌లో తీస్తారా? లేక ‘రంగస్థలం’ సినిమా తరహాలో కొన్ని కీలకమైన, వైడ్‌ సన్నివేశాలు అక్కడ తీసి.. తిరిగి హైదరాబాద్‌ స్టూడియోలకు వచ్చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది.

అయితే నాగార్జున – ప్రసన్న సినిమా మలయాళంలో జోజు జార్జ్ నటించిన ‘మరియమ్ పొరింజు జోస్’ అనే సినిమాకు రీమేక్ అని అంటున్నారు. మూల కథతో పాటు కొన్ని సన్నివేశాలు తీసుకుని ప్రసన్న తన స్టైల్‌లో మార్పులు చేస్తున్నారని సమాచారం. తనదైన కామెడీ సీన్స్‌ను సినిమాకు యాడ్‌ చేసే పనిలో టీమ్‌తో ఇప్పటికే చాలా సిట్టింగ్స్‌ జరిగాయట. అన్నట్లు ఈ సినిమాలో నాగార్జునతో పాటు అల్లరి నరేష్ కూడా నటిస్తారు అని టాక్‌.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus