Pushpa2: బన్నీతో గొడవకు సీనియర్ యాక్టర్ రెడీ!

  • December 6, 2022 / 04:24 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘పుష్ప’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. నార్త్ లో కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు రష్యాలో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. దీని ప్రమోషన్స్ కోసం టీమ్ మొత్తం రష్యాకు వెళ్లింది. ఇప్పుడు ఈ సినిమాకి సెకండ్ పార్ట్ రాబోతుంది. ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటివరకు ‘పుష్ప2’ షూటింగ్ మొదలుపెట్టలేదు. ఫస్ట్ పార్ట్ లో కనిపించిన నటీనటులే సెకండ్ పార్ట్ లో కూడా కంటిన్యూ అవ్వనున్నారు. ఒకట్రెండు కొత్త క్యారెక్టర్స్ కనిపించబోతున్నాయి. ‘పుష్ప1’లో ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ, రావు రమేష్ లతో పాటు మరో కొత్త విలన్ కూడా ఉన్నాడని సమాచారం. ఈ విలన్ ఎవరనేది ఇంకా అధికారికంగా చెప్పలేదు కానీ అతడెవరనేది ఇండస్ట్రీ వర్గాల ద్వారా బయటకొచ్చింది. అతడు మరెవరో కాదు నటుడు జగపతి బాబు.

కథ ప్రకారం సినిమాలో ఒక రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించనున్నారు జగపతి బాబు. ఉన్న విలన్స్ తో పాటు జగపతి బాబుతో కూడా ఫైట్ చేయబోతున్నారు బన్నీ. సినిమాలో యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ స్థాయిలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. పుష్ప’ సినిమా డిసెంబర్ లో విడుదలైంది. ఈసారి కూడా అలానే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం భారీగా పెట్టుబడి పెట్టబోతున్నారు. ఇప్పటికే బడ్జెట్ గురించి నిర్మాతలతో అల్లు అర్జున్ డిస్కస్ చేశారని టాక్.

సుకుమార్ ఎంత అడిగితే అంత ఇవ్వమని, ఖర్చు పరంగా అతడి మీద ఒత్తిడి తీసుకు రావద్దని, ఇంత అని లెక్కలు వేసుకోవద్దని చెప్పేశారట. అంటే బడ్జెట్ విషయంలో సుకుమార్ కి ఫ్రీడమ్ లభించినట్లే. ఈ సినిమాలు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus