అదే సెంటిమెంట్ ను మరోసారి రిపీట్ చేస్తున్న త్రివిక్రమ్..!

‘ఆర్.ఆర్.ఆర్’ పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో ఓ చిత్రం చెయ్యడానికి రెడీ అవుతున్నాడు ఎన్టీఆర్. ఇది ఎన్టీఆర్ కు 30 వ చిత్రం కావడం విశేషం. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ మరియు ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ బ్యానర్ల పై చినబాబు,కళ్యాణ్ రామ్ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. పొలిటికల్ నేపధ్యంలో సాగే కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్.. ఓ బిజినెస్ మ్యాన్ గా, పొలిటిషియన్ గా కనిపించనున్నాడు.

‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ ను ఈ చిత్రానికి అనుకుంటున్నట్టు ప్రచారం జరుగుతుంది. అయితే ఈ చిత్రంలో మరో యంగ్ హీరో కూడా నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ నుండీ(ఒక్క ‘అఆ’ ను మినహాయిస్తే) తన ప్రతీ సినిమాలోనూ యంగ్ హీరోలకు ఏదో ఒక పాత్ర రాస్తూ వస్తున్నాడు త్రివిక్రమ్. ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ లో శ్రీవిష్ణు, ‘అజ్ఞాతవాసి’ లో ఆది పినిశెట్టి, ‘అరవింద సమేత’ లో నవీన్ చంద్ర అలాగే ‘అల వైకుంఠపురములో’ సుశాంత్…. వంటి యంగ్ హీరోలు నటించారు.

ఇప్పుడు ‘అయినను పోయి రావలె హస్తినకు’ చిత్రంలో కూడా ఓ యంగ్ హీరో కోసం ఓ పాత్ర రాస్తున్నాడట త్రివిక్రమ్. మరి ఆ పాత్ర ఎలా ఉండబోతుంది.. ఎవరు చేయబోతున్నారు అనే విషయాలు మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఇక ఈ చిత్రంలో కూడా పూజా హెగ్దే హీరోయిన్ గా నటించే అవకాశం ఉందని మాత్రం తెలుస్తుంది.

Most Recommended Video

తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus