కొన్ని సంవత్సరాల క్రితం అక్కినేని నాగేశ్వరరావు గారు ఆరోగ్య సమస్యల వల్ల మృతి చెందారనే సంగతి తెలిసిందే. ఏఎన్నార్ చివరి సినిమా మనం బాక్సాఫీస్ వద్ద అంచనాలను మించి హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు భారీ స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. అయితే ఏఎన్నార్ జీవించి ఉన్న సమయంలో ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సీనియర్ ఎన్టీఆర్ సినిమాల్లోకి వచ్చిన సమయంలో నా పని అయిపోతుందని అందరూ అనుకున్నారని ఆయన తెలిపారు.
కొందరు ప్రొడ్యూసర్లే ఈ విషయాన్ని నాతో చెప్పారని ఆయన చెప్పుకొచ్చారు. సీనియర్ ఎన్టీఆర్ గంభీరంగా ఎత్తుగా ఉండేవారని వాయిస్ కూడా నాకంటే బాగుంటుందని ఎన్టీఆర్ టాలెంటెడ్ అని ఏఎన్నార్ అన్నారు. ఇద్దరికీ మార్కులు వేస్తే ఆయనకే ఎక్కువ మార్కులు పడతాయని ఏఎన్నార్ కామెంట్లు చేశారు. రావాణాసురుని పాత్రలో నటించి ఎన్టీఆర్ సమర్థుడు అని అనిపించుకున్నాడని ఏఎన్నార్ తెలిపారు. దుర్యోధనుడి పాత్రను కూడా ఎన్టీఆర్ అద్భుతంగా పోషించారని ఏఎన్నార్ చెప్పుకొచ్చారు.
అలాంటి పాత్రలలో నేను నటిస్తే రక్తి కట్టవని రామారావు కర్ణుడి వేషం వేయమని కోరినా నేను వేయలేదని ఏఎన్నార్ తెలిపారు. చాణక్య చంద్రగుప్త సినిమాలో చంద్రగుప్తుని వేషంలో నటించాలని ఎన్టీఆర్ కోరారని తాను మాత్రం చాణిక్యుని వేషం వేశానని ఏఎన్నార్ చెప్పుకొచ్చారు. ఒక సినిమాలో నేను కృష్ణుడి వేషం వేయాలని ఎన్టీఆర్ కోరారని ఆ పాత్రకు ఎన్టీఆర్ పాపులర్ కావడంతో నేను నిరాకరించానని ఏఎన్నార్ తెలిపారు.
కృష్ణుడి పాత్రకు నేను సూట్ అవుతానని అయినప్పటికీ చేయనని చెప్పానని ఏఎన్నార్ చెప్పుకొచ్చారు. నాకు ఎన్టీఆర్ కు నటన విషయంలో పోటీ ఉండేదని నా సినీ కెరీర్ లో ఎక్కువ సినిమాలకు కో స్టార్ గా చేసిన వారిలో ఎన్టీఆర్ ఒకరని ఏఎన్నార్ చెప్పుకొచ్చారు. ఏఎన్నార్, ఎన్టీఆర్ కలిసి నటించిన సినిమాలు అంచనాలకు మించి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.
Most Recommended Video
టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!