Ante Sundaraniki: అంటే సుందరానికి మూవీ విషయంలో అలా జరిగిందా?

నాని, నజ్రియా హీరోహీరోయిన్లుగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిన అంటే సుందరానికి సినిమా భారీ అంచనాలతో థియేటర్లలో విడుదలై ఫ్లాప్ రిజల్ట్ ను అందుకుంది. కథ, కథనం కొత్తగా ఉన్నా నిడివి మరీ ఎక్కువగా ఉండటం క్లాస్ ప్రేక్షకులకు మాత్రమే నచ్చే కథాంశం కావడంతో ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోలేదని తెలుస్తోంది. క్రిటిక్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల మెప్పు పొందలేదు.

అయితే ప్రముఖ ఓటీటీలలో ఒకటైన నెట్ ఫ్లిక్స్ లో ప్రస్తుతం ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. నెట్ ఫ్లిక్స్ లో అంటే సుందరానికి సినిమా టాప్ 1 ప్లేస్ లో ఉంది. ఈ సినిమాలో నాని బ్రాహ్మణ యువకుని పాత్రలో నటించి మెప్పించడం గమనార్హం. థియేటర్లలో ఫ్లాఫైన అంటే సుందరానికి సినిమా నెట్ ఫ్లిక్స్ లో మాత్రం టాప్ లో ఉండటం గమనార్హం. పలువురు సెలబ్రిటీలు సైతం నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమాను చూసి సోషల్ మీడియా వేదికగా ప్రశంసిస్తుండటం గమనార్హం.

నజ్రియాకు తెలుగులో అంటే సుందరానికి సినిమా తొలి సినిమా కాగా అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించి మెప్పించారు. అంటే సుందరానికి తమిళ వెర్షన్ అడాడే సుందర నెట్ ఫ్లిక్స్ లో టాప్ 6 ప్లేస్ లో ఉండటం గమనార్హం. నాని సినిమా నెట్ ఫ్లిక్స్ లో అరుదైన రికార్డును సొంతం చేసుకోవడంతో నాని ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

నాని తర్వాత సినిమాలతో కూడా రికార్డులు క్రియేట్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. నాని ప్రస్తుతం దసరా అనే సినిమాలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై కూడా భారీస్థాయిలోనే అంచనాలు నెలకొన్నాయి. నానికి జోడీగా కీర్తి సురేష్ ఈ సినిమాలో నటిస్తుండటం గమనార్హం. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus