Ante Sundariniki: నాని ఖాతాలో మరో సక్సెస్ చేరినట్టేనా?

నాని, నజ్రియా హీరోహీరోయిన్లుగా నటించిన అంటే సుందరానికి సినిమాకు క్రిటిక్స్ నుంచి, ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. నాని గత సినిమాల స్థాయిలో కాకపోయినా ఫస్ట్ వీకెండ్ వరకు ఈ సినిమాకు చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. అయితే అంటే సుందరానికి సినిమా మండే బుకింగ్స్ మాత్రం ఆశాజనకంగా లేవు. హైదరాబాద్ లోని అన్ని ప్రముఖ థియేటర్లలో ఈ సినిమాకు టికెట్స్ అందుబాటులో ఉన్నాయి. టికెట్ రేట్లు సాధారణంగానే ఉన్నా ఈ సినిమా బుకింగ్స్ మాత్రం ఆశాజనకంగా లేకపోవడం గమనార్హం.

మేజర్ సినిమాలా ఈ సినిమాకు కూడా టికెట్ రేట్లను తగ్గించి ఉంటే ఈ సినిమాకు ప్లస్ అయ్యేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే మేజర్, విక్రమ్ సినిమాల హవా తగ్గడం ఈ శుక్రవారం రోజున విరాటపర్వం మినహా మరే పెద్ద సినిమా నుంచి పోటీ లేకపోవడం అంటే సుందరానికి సినిమాకు ప్లస్ అవుతోంది. నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లకు తక్కువ రేట్లకే హక్కులను విక్రయించిన నేపథ్యంలో అంటే సుందరానికి బ్రేక్ ఈవెన్ అయినా భారీ లాభాలను అందించే అవకాశాలు అయితే లేవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

నాని తను హీరోగా తెరకెక్కిన సినిమాలతో సక్సెస్ సాధిస్తున్నా భారీ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు. ఈరోజు నుంచి అంటే సుందరానికి కలెక్షన్లలో మాత్రం భారీ డ్రాప్ కనిపించే అవకాశాలు ఉన్నాయి. నాని ఈ సినిమా కోసం ఏకంగా 15 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

40 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా రిలీజ్ కు ముందే నిర్మాతలకు 10 కోట్ల రూపాయలు లాభంగా దక్కిందని బోగట్టా. నాని హీరోగా తెరకెక్కుతున్న దసరా మూవీ 60 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమాతో నాని కమర్షియల్ గా భారీ సక్సెస్ ను సొంతం చేసుకుంటారేమో చూడాలి.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus