Bheemla Nayak Movie Song: ఫ్యాన్స్ కు పవన్ కళ్యాణ్ స్పెషల్ ట్రీట్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రల్లో సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ సినిమాకు రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్, ప్రచార చిత్రాలు, ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇందులో పవన్ కళ్యాణ్ కు జోడీగా నిత్యామీనన్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. వీరిద్దరికీ సంబంధించిన ఓ పాటను దసరా కానుకగా పవన్ ఫ్యాన్స్ కోసం విడుదల చేయబోతున్నట్లు ఇటీవలే మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

చెప్పినట్లుగానే సినిమా చిత్రబృందం నిన్న ప్రోమో వదిలి శుక్రవారం నాడు పూర్తి పాటను విడుదల చేశారు. ‘అంత ఇష్టం ఏందయ్యా..’ అంటూ సాగే పాట శ్రోతలను ఆకట్టుకుంటోంది. రామ జోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను సింగర్ చిత్ర ఆలపించారు. తమన్ సంగీతం అందించారు. ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ లో బిజూమీనన్ పోషించిన పాత్రను తెలుగులో పవన్ కళ్యాణ్ .. పృథ్వీరాజ్‌ సుకుమార్‌ పాత్రను రానా పోషిస్తున్నారు.

సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాకి త్రివిక్రమ్ మాటలు-స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 12న సినిమా విడుదల చేయబోతున్నారు.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!


సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus