త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సినిమాలో అర్ధవంతంగా రాయడమే కాదు.. రొమాన్స్ ని కూడా చాలా అందంగా చూపిస్తారు. అది పవన్ కళ్యాణ్ కి అంటే మరింత స్పెషల్ గా ప్రేమ సన్నివేశాలను చిత్రీకరిస్తుంటారు. వీరిద్దరి కలయికలో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది సినిమాలలో ఇద్దరు హీరోయిన్స్ ని పెట్టి ఎంటర్టైన్ చేశారు. ఇప్పుడు మూడో సినిమాలోనూ ఇద్దరు హీరోయిన్స్ ని పెట్టారు. అను ఇమ్మాన్యుయల్, కీర్తి సురేశ్ లు పవన్ సరసన నటిస్తున్నారు. దాదాపు 70 శతాహం షూటింగ్ జరుపుకున్న ఈ మూవీలోని అను ఇమ్మాన్యుయల్ పాత్ర బయటికి వచ్చింది.
ఇందులో పవన్ ఓ సాఫ్ట్ వేర్ కంపెనీకి బాస్ గా కనిపించనుండగా, అతనికి అసిస్టెంట్ పాత్రలో అను అందాలు ఒలకబోయనుంది. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు చాలా క్యూట్ గా ఉంటాయని చిత్ర బృందం తెలిపింది. సీనియర్ నటి కుష్బూ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు. హారిక అండ్ హాసిని బ్యానర్లో రాధాకృష్ణ వందకోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకి విక్టరీ వెంకటేష్ గెస్ట్ అప్పీరియన్స్ ప్లస్ కానుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.