అను ఇమ్మాన్యుయేల్ కోరిక మేరకే అలా చేసిన అల్లు అర్జున్.!

రచయిత వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ అల్లు అర్జున్ చేస్తున్న సినిమా “నా పేరు సూర్య”. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్, శరత్‌కుమార్ ముఖ్య పాత్రలు పోషించారు. కె.నాగబాబు సమర్పణలో రామలక్ష్మి సినీ క్రియేషన్స్ బ్యానర్‌లో శిరీష శ్రీధర్, బన్నీ వాసులు కలిసి నిర్మిస్తున్న ఈ మూవీ రీసెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్నీ ట్విట్టర్ వేదికపై బన్నీ తన అభిమానులకు వెల్లడించారు. ” చాలా సంతోషంగా నా పేరు సూర్య సినిమా షూటింగ్ పూర్తి చేశాము.

చాలా మంచి యూనిట్‌తో ప‌నిచేశాను. ఈ చిత్రం కోసం ప‌నిచేసిన ప్ర‌తీ ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు” అని వెల్లడించారు. అలాగే హీరోయిన్ అనూ ఇమ్మానుయేల్ కోరిన కోరిక గురించి కూడా మ‌రో ట్వీట్ చేశారు. “నా హీరోయిన్ అనూ ఇమ్మానుయేల్ న‌న్ను అడిగిన మొద‌టి, చివ‌రి కోరిక ఓ సెల్ఫీ. షూటింగ్ పూర్త‌యిపోయిన త‌ర్వాత అనుతో దిగిన మొద‌టి సెల్ఫీ ఇదే” అంటూ ఓ ఫోటోను పోస్ట్ చేశారు. ఈ ఫోటో వైరల్ అయింది. ఈ సినిమాకి విశాల్-శేఖర్ లు సంగీతాన్ని అందించారు. ఈ చిత్ర ఆడియో వేడుకను ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోని మిల‌ట‌రీ మాధ‌వ‌రం గ్రామంలో ఈనెల 22 న నిర్వహించనున్నారు. వచ్చే నెల 4 న థియేటర్లోకి రానున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus