Anupama: అనుపమ గ్లామర్ షోపై అభిమాని ఆవేదన.. నచ్చడం లేదంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అభినయ ప్రధాన పాత్రల్లో నటించిన హీరోయిన్లలో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. అనుపమ పరమేశ్వరన్ కు సోషల్ మీడియాలో సైతం మైండ్ బ్లాంక్ అయ్యే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే టిల్లు స్వ్కేర్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ గ్లామర్ షో చేయడం గురించి కొన్ని నెగిటివ్ కామెంట్లు వినిపించాయి. అయితే ఒక అభిమాని ఎమోషనల్ అవుతూ చేసిన కామెంట్లు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. “ఏవండీ అనుపమగారూ..! నా ఆటోలో మీ ఫోటో ఎందుకు వేశానో తెలుసా..!

ఒకప్పుడు మీరు తీసిన సినిమాలు అలాంటివండి..! అ.ఆ సినిమా చూసి మిమ్మల్ని ఇష్టపడని వాళ్లు ఉంటారా? శతమానం భవతి సినిమాలో అసలు మరదలు అంటే మీలాగా ఉండాలి అనిపించేలా యాక్ట్ చేశారు..! ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమకోసమే ఎలాంటి సినిమాలు తీశారండి.. హలో గురు ప్రేమకోసమే సినిమాలో కాఫీ సీన్ చేసింది మీరా కాదా అని ఎంతో టెన్షన్ పడ్డాం” అని అభిమాని కామెంట్ చేశారు.

“అలాంటిది మీరు ఎలాంటి సినిమాలు తీస్తున్నారండి.. రౌడీ బాయ్స్, టిల్లు స్క్వేర్ ఎందుకండీ మీకు ఇలాంటి సినిమాలు.. ఒకప్పుడు సావిత్రిగారు, సౌందర్యగారు ఎలాంటి సినిమాలు తీశారండి.. వారిలాగే మిమ్మల్ని అనుకున్నాం.. మీరు ఇలాంటి సినిమాలు తీయడం నాకు ఏ మాత్రం నచ్చడం లేదని దయ చేసి మంచి మంచి పాత్రలు ఉన్న సినిమా చేయాలి” అని అభిమాని కామెంట్లు చేశారు.

అనుపమ (Anupama) ఫ్యాన్ చేసిన ఈ వీడియోపై కొంతమంది పాజిటివ్ గా రియాక్ట్ అవుతుంటే మరి కొందరు నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ కు ఇన్ స్టాగ్రామ్ లో కోటీ 60 లక్షల ఫాలోవర్లు ఉన్నారు. అనుపమ పరమేశ్వరన్ త్వరలో మరిన్ని కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని సమాచారం అందుతోంది. అనుపమ పరమేశ్వరన్ రెమ్యునరేషన్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

భామా కలాపం 2 సినిమా రివ్యూ & రేటింగ్!

భ్రమయుగం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజధాని ఫైల్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus