ఆ హీరోయిన్ తప్పుకోవడంతో అనుపమ పరమేశ్వరన్ కి ఛాన్స్ దొరికింది…?

గతేడాది తమిళంలో విడుదలయ్యి భారీ విజయం సాధించిన ‘రాచ్చసన్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. విష్ణు విశాల్ .. అమలా పాల్ జంటగా నటించిన ఈ చిత్రం… సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొంది విశేషమైన ప్రేక్షకాదరణ పొందింది. అటువంటి చిత్రాన్ని తెలుగులో ఒక్క హిట్టు కూడా లేని డైరెక్టర్ రమేష్ వర్మ డైరెక్ట్ చేస్తుండగా… ఒక్క హిట్టు కూడా లేని బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని యువ హీరో హవీష్ లక్ష్మణ్ కోనేరు, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇటీవల ఈ చిత్రానికి సంబందించిన పూజా కార్యక్రమాలను ఇటీవల నిర్వహించారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా మొదట రాశి ఖన్నా ను అనుకున్నప్పటికీ… తనకి వరుస సినిమా ఆఫర్లు ఉండడంతో ఈ ఆఫర్ కి నో చెప్పిందట. ఇక ఈ నేపథ్యంలో ఈ చిత్రంలో హీరోయిన్ గా అనుపమా పరమేశ్వరన్ సంప్రదించినట్టు తెలుస్తుంది. దీనికి అనుపమ కూడా సానుకూలంగా స్పందించిందట. అందులోనూ ప్రస్తుతం అనుపమకి తెలుగులో పెద్దగా అవకాశాలు దీంతో ఓకే చెప్పేసినట్టు తెలుస్తుంది. మరి ఈ వార్తలో ఎంత వరకూ నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఎదురు చూడాల్సిందే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus