Anupama Parameswaran: ఈ ఏడాదైనా అనుపమకు కలిసొస్తుందా..?

మలయాళ ప్రేమమ్ లో నటించి దక్షిణాది భాషల్లో గుర్తింపును సంపాదించుకున్న అనుపమ పరమేశ్వరన్ కు టాలెంట్ పుష్కలంగా ఉన్నా ఆఫర్లు మాత్రం ఎక్కువగా లేవు. తెలుగులో ఈమె నటించిన ప్రేమమ్, శతమానం భవతి సినిమాలు మాత్రమే హిట్ అయాయి. అఆ సినిమా హిట్ అయినా ఆ సినిమాలో అనుపమది ప్రాధాన్యత లేని పాత్ర కావడం గమనార్హం. కెరీర్ మొదట్లో అనుపమ అభినయానికి ప్రాధాన్యత ఉన్న రోల్స్ లోనే నటించారు. ఈ మధ్య కాలంలో అనుపమ హాట్ ఫోటో షూట్లతో రెచ్చిపోతున్నప్పటికీ ఆమెను దర్శకనిర్మాతలు పట్టించుకోవడం లేదు.

నిఖిల్ హీరోగా నటిస్తున్న రెండు సినిమాలలో అనుపమ హీరోయిన్ కాగా ఈ సినిమాల రిజల్ట్ పైనే అనుపమ భవిష్యత్తు ఆధారపడి ఉందని చెప్పవచ్చు. అయితే ఈ హీరోయిన్ కరోనా వల్ల షూటింగ్ లు ఆగిపోవడంతో ప్రస్తుతం వ్యవసాయం చేస్తోందని తపియోక అనే దుంపలను పండించిందని సమాచారం. అనుపమ చేతిలో దుంపలను పట్టుకొని దిగిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫోటోలను చూసిన కొంతమంది నెటిజన్లు మాత్రం సినిమా ఆఫర్లు లేకపోవడం వల్లే అనుపమ పరమేశ్వరన్ వ్యవసాయం చేస్తుందంటూ కామెంట్లు చేయడం గమనార్హం.

2020 సంవత్సరం అనుపమకు పెద్దగా కలిసిరాలేదు. 2021లో ఆఫర్లతో బిజీ కావడంతో పాటు విజయాలను సొంతం చేసుకుంటానని అనుపమ భావిస్తున్నారు. మరి ఈ ఏడాదైనా అనుపమకు కలిసొస్తుందో లేదో చూడాల్సి ఉంది. ప్రస్తుతం ఈ మలయాళ బ్యూటీ పల్నాటి సూర్యప్రతాప్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న 18 పేజెస్ సినిమాతో పాటు చందూ మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కార్తికేయ2 సినిమాలో నటిస్తున్నారు.


1

2

3

4

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus