Anupama: బ్రదర్ అంటూ నెటిజన్ కు దిమ్మ తిరిగే రిప్లై ఇచ్చిన అనుపమ!

  • June 12, 2023 / 09:04 PM IST

మలయాళీ ఇండస్ట్రీ నుంచి హీరోయిన్ గా ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి అనుపమ పరమేశ్వరన్. ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇక నిఖిల్ సరసన ఈమె నటించిన కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు.ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి అనుపమ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.

ప్రస్తుతం ఈమె సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న డీజే టిల్లు సినిమా సీక్వెల్ చిత్రం డీజే టిల్లు స్క్వేర్ సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాతో పాటు మరో రెండు మూడు సినిమాల షూటింగ్ పనులలో అనుపమ బిజీగా గడుపుతున్నారు. ఇలా సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

తాజాగా ఒక నెటిజన్ సోషల్ మీడియా వేదికగా దారుణంగా అనుపమ పరమేశ్వరన్ ను అవమానించారు. ఈ సందర్భంగా నేటిజన్ ఈమె గురించి మాట్లాడుతూ… నువ్వు పెద్ద హీరోయిన్ ఏమీ కాదు…అందుకే నీకు పెద్ద పెద్ద సినిమాలలో అవకాశాలు రావడం లేదు అసలు నువ్వు హీరోయిన్ మెటీరియల్ కాదు అంటూ ఒక నేటిజన్ దారుణంగా ఈమె గురించి చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇక అనుపమ (Anupama) ఈ కామెంట్ పై స్పందిస్తూ తనదైన స్టైల్ లో నెటిజన్ కి సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా ఈమె రిప్లై ఇస్తూ అవును బ్రదర్ మీరు చెప్పింది నిజమే నేను హీరోయిన్ టైప్ కాదు హీరో టైప్ అంటూ చెప్పినటువంటి ఈ సమాధానం ప్రస్తుతం వైరల్ గా మారింది. అనుపమ ఈ సమాధానంతో సదరు నెటిజన్ చెంప చెల్లుమనిపించేలా దీటుగా సమాధానం చెప్పారంటూ పలువురు ఈమెకు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus