Anupama: సరికొత్త ట్రెండ్ సెట్ చేయబోతున్న అనుపమ.. వీడియో వైరల్!

అనుపమ పరమేశ్వరన్ మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైనటువంటి ఈమె మలియాల చిత్ర పరిశ్రమలో మాత్రమే కాకుండా తెలుగు తమిళ భాషలలో కూడా అవకాశాలను అందుకుంటు బిజీ హీరోయిన్ గా మారిపోయారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇదివరకి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా ఈమె సరికొత్త ట్రెండ్ సెట్ చేయడానికి కూడా ఈమె సిద్ధమయ్యారని తెలుస్తోంది.

ఇలా హీరోయిన్గా తెలుగులో రెండు సినిమాలతో పాటు మలయాళంలోను తమిళంలోనూ మరో రెండు సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి అనుపమ పరమేశ్వరన్ తాజాగా ప్రవేట్ ఆల్బమ్ సాంగ్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వీడియో సాంగ్ విడుదల కావడంతో ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.సాధారణంగా హీరోయిన్స్ ఎవరు కూడా ఇలా ప్రైవేట్ ఆల్బమ్స్ చేయరు ఎందుకంటే ఇలాంటి ప్రైవేట్ ఆల్బమ్స్ హీరోయిన్స్ చేయడం వల్ల వాటికి పెద్దగా ఆదరణ రావడం లేదు.

ఈ క్రమంలోనే ఇలాంటి ఆల్బమ్స్ చేయడానికి హీరోయిన్స్ ఎవరు ఆసక్తి చూపరు కానీ (Anupama) అనుపమ పరమేశ్వరన్ మాత్రం ఇలా ప్రవేట్ ఆల్బమ్ సాంగ్ చేయడంతో ఇవే బిజీ హీరోయిన్ అయినప్పటికీ డబ్బు కోసమే ఇలా ప్రవేట్ ఆల్బమ్స్ చేస్తున్నారా లేకపోతే సరికొత్త ట్రెండ్ సృష్టించడానికి ఇలా సాంగ్స్ చేస్తున్నారా అన్న సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారండి.

పద పద అంటూ సాగే ఈ సాంగ్ కు రిచర్డ్ ప్రసాద్ దర్శకత్వం వహించగా.. ఏ.వసంత్ సినిమాటోగ్రఫీ అందించారు. సింగర్ చన్మయి శ్రీపాద పాడిన ఈ పాటను డెన్నిస్ నార్టన్ కంపోజ్ చేశాడు. జపాన్ లోని టోక్యో అందాలు చూపిస్తూ ఎంతో కలర్ ఫుల్ గా ఈ సాంగ్ నుచిత్రీకరించారు ఇందులో అనుపమ ఎంతో సంతోషంతో చాలా ఉత్సాహంగా ఈ పాటకు డాన్స్ చేసినట్టు తెలుస్తోంది. ఈమె తెలుగు సినిమాల విషయానికి వస్తే టిల్లు స్క్వేర్ తో పాటు, రవితేజ హీరోగా నటిస్తున్న ఈగల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus