King 100: ‘కింగ్ 100’ లో అనుష్క

అక్కినేని నాగార్జున 100వ సినిమా అనౌన్స్మెంట్ కోసం అభిమానులు 2 ఏళ్ళ నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చారు.50 మందికి పైగా దర్శకులు చెప్పిన కథలు విని ఫైనల్ గా తమిళ దర్శకుడు రా కార్తీక్ చెప్పిన కథకు నాగార్జున ఓకే చెప్పడం జరిగింది. ఏడాది నుండి అతను ఈ స్క్రిప్ట్ పై వర్క్ చేస్తూ వచ్చాడు.దసరా పండుగ నాడు ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో సైలెంట్ గా ప్రారంభమైంది.

King 100

నటీనటుల ఎంపిక కూడా అందరి దృష్టిని ఆకర్షించే విధంగా జరుగుతుంది. ఇటీవల సీనియర్ స్టార్ హీరోయిన్ టబు ఈ ప్రాజెక్టులోకి ఎంట్రీ ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. అలాగే నాగ్ సతీమణి అమల, పెద్ద కుమారుడు నాగ చైతన్య, పెద్ద కోడలు శోభిత, చిన్న కుమారుడు అఖిల్ వంటి వారు ఈ ప్రాజెక్టులో భాగం కానున్నట్టు కూడా ప్రచారం జరిగింది.

ఇప్పుడు అనుష్క కూడా ‘కింగ్ 100’ లో భాగం కానున్నట్టు టాక్ నడుస్తుంది. నాగార్జున – అనుష్క..ల కాంబోకి టాలీవుడ్లో ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే అనుష్కని హీరోయిన్ గా పరిచయం చేసింది నాగార్జునే. ‘సూపర్’ తో అనుష్క హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అటు తర్వాత ‘డాన్’, ‘రగడ’, ‘ఢమరుకం’ వంటి సినిమాల్లో కూడా కలిసి నటించారు. అలాగే ‘కేడీ’ ‘కింగ్’ ‘ఊపిరి’ ‘సోగ్గాడే చిన్ని నాయన’ వంటి సినిమాల్లో కూడా అనుష్క కేమియోలు ఉన్నాయి.

నాగార్జున సినిమా అంటే అనుష్క కూడా ఎటువంటి కండిషన్స్ పెట్టకుండా నటించడానికి ముందుకొస్తుంది అనే టాక్ కూడా ఇండస్ట్రీలో ఉంది. ఆ రకంగా చూస్తే ‘కింగ్ 100’ లో అనుష్క భాగం కావడం ఖాయమనే చెప్పాలి.

కన్ఫ్యూజ్ అయ్యి ‘ఆర్య’ కి బదులు ‘ఆర్య 2’ తీసేశాడా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus