కన్ఫ్యూజ్ అయ్యి ‘ఆర్య’ కి బదులు ‘ఆర్య 2’ తీసేశాడా?

ప్రదీప్ రంగనాథన్ నటించిన ‘డ్యూడ్’ సినిమా ఈ శుక్రవారం అంటే అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘ఈ దీపావళికి 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.. అందులో ‘డ్యూడ్’ ఒకటి’ అని తెలిసినప్పుడు.. అందరూ ఆ సినిమానే దీపావళి విన్నర్ గా నిలుస్తుంది అని అంతా అనుకున్నారు. ‘లవ్ టుడే’ ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ సినిమాలతో సూపర్ ఫామ్లో ఉన్నాడు ప్రదీప్. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద గట్టిగా సందడి చేస్తుంది అని అంతా అనుకున్నారు.

Dude

కానీ కట్ చేస్తే.. మొదటి షోతోనే సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ బాగున్నా.. సెకండాఫ్ తేలిపోయింది అనే కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి. తమిళంలో అయితే కంప్లీట్ నెగిటివ్ టాక్ ఉంది. అక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా సో సో గానే ఉన్నాయి. తెలుగులో అయితే బుకింగ్స్ బాగానే ఉన్నాయి.

ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. ‘డ్యూడ్’ సినిమాతో కీర్తీశ్వరన్ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ప్రమోషన్స్ లో నిర్మాతలు ఇతనికి మంచి హైప్ ఇచ్చారు.

అలాగే ఓ దశలో కీర్తి.. ‘సుకుమార్ ‘ఆర్య’ సినిమా ఇన్స్పిరేషన్ తో ‘డ్యూడ్’ కథని డిజైన్ చేసుకున్నట్లు’ తెలిపాడు. కానీ కట్ చేస్తే… అతను తీసిన సినిమా చాలా వరకు ‘ఆర్య 2’ ని పోలి ఉండటం గమనార్హం. ఆ సినిమాలో హీరో అల్లు అర్జున్ ఏ రకంగా అయితే ప్రేమికులైన నవదీప్, కాజల్..లను కలపడానికి ఫేక్ మ్యారేజ్ చేసుకుంటాడో… ‘డ్యూడ్’ లో కూడా హీరో ప్రదీప్ రంగనాథన్ మామితా బైజుని ఆమె ప్రియుడితో కలిపేందుకు ఫేక్ మ్యారేజ్ చేసుకుంటాడు.

దీంతో ‘దర్శకుడు కన్ఫ్యూజ్ అయ్యి సూపర్ హిట్ అయిన ‘ఆర్య’ కి బదులు ప్లాప్ అయిన ‘ఆర్య 2′ చూసి అలాంటి కథ రాసుకున్నాడేమో’ అంటూ సోషల్ మీడియాలో ఫన్నీ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.

3 ఔట్.. ఇప్పుడు అందరి చూపు కిరణ్ పైనే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus