Anushka: జేజమ్మ పాత్రపై అనుష్క షాకింగ్ కామెంట్స్!

  • January 18, 2022 / 11:14 AM IST

అనుష్క సినీ కెరీర్ లోని ప్రత్యేకమైన సినిమాలలో అరుంధతి సినిమా కూడా ఒకటి. 2009 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. అప్పటివరకు గ్లామర్ రోల్స్ లో ఎక్కువగా నటించిన అనుష్కకు ఈ సినిమా ప్రత్యేకమైన ఇమేజ్ ను తెచ్చిపెట్టింది. మొదట కొంతమంది హీరోయిన్లు ఈ కథను రిజెక్ట్ చేయగా అనుష్క మాత్రం ఈ కథలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు.

అనుష్క కాకుండా ఈ సినిమాలో మరే హీరోయిన్ నటించినా ఈ సినిమా ఈ స్థాయిలో సక్సెస్ అయ్యేది కాదనే కామెంట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించాయి. ఈ సినిమా విడుదలై 13 సంవత్సరాలు పూర్తైంది. అనుష్క ఈ సినిమా గురించి ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ లో అరుంధతి సినిమా తనకెంతో స్పెషల్ అని అన్నారు. ప్రతి నటికి జీవితకాలంలో ఒకసారి మాత్రమే పోషించే పాత్ర ఒకటి ఉంటుందని నా లైఫ్ లో ఆ పాత్ర అరుంధతి పాత్ర అని అనుష్క అన్నారు.

జేజమ్మ పాత్రలో నటించే ఛాన్స్ ఇచ్చినందుకు కోడి రామకృష్ణకు అనుష్క ధన్యవాదాలు తెలిపారు. హర్రర్ ఫాంటసీ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా సోనూసూద్ కు విలన్ గా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమా తర్వాత సోనూసూద్ కు ఊహించని స్థాయిలో విలన్ గా ఆఫర్లు పెరిగాయనే సంగతి తెలిసిందే. అరుంధతి సినిమా 2009 సంవత్సరంలో రికార్డు స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకున్న సినిమాలలో ఒకటి. వదల బొమ్మాళి వదలా అంటూ సోనూసూద్ పశుపతి పాత్రలో చెప్పే డైలాగ్ సినిమాకే హైలెట్ గా నిలిచింది.

ఈ సినిమాకు ఫిల్మ్ ఫేర్ అవార్డులతో పాటు నంది అవార్డులు సైతం వచ్చాయి. ఈ సినిమా తర్వాత అనుష్కకు లేడీ ఓరియేంటెడ్ సినిమాలలో ఆఫర్లు పెరిగాయి. ఇతర భాషల్లో కూడా ఈ సినిమా రీమేక్ కావడం గమనార్హం. అనుష్క సినీ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!
చిరు పనైపోయిందన్నారు.. ప్లాప్ అన్నారు.. ‘హిట్లర్’ గురించి ఆసక్తికరమైన విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus