పెళ్లి పీటలు ఎక్కనున్న “జేజమ్మ!!!
- September 17, 2016 / 08:05 AM ISTByFilmy Focus
టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒకరైన అనుష్క షెట్టి….అలియాస్ స్వీటీ బడా హీరోయిన్ గా అటు టాలీవుడ్ లో ఇటు తమిళ పరిశ్రమలో దూసుకుపోతుంది. అయితే అదే క్రమంలో ఈ భామకు వయసు సైతం ముదిరిపోవడంతో త్వరలోనే పెళ్లి చేసుకోవాలి అని డిసైడ్ అయిపోయింది. ఇదిలా ఉంటే గతంలో ఒక టీవీ షోలో పాల్గొన్న స్వీటి తనకు బెంగళూరులో బోయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని, త్వరలోనే తనతో పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్దం అని చెప్పింది. ఆ తరువాత బిజీ హీరోయిన్ గా మారిపోయి వరుసగా సినిమాలు చేసుకుంటూ…నిమిషం తీరిక లేకుండా సాగిపోతుంది.
ఇదిలా ఉంటే తాజాగా టాలీవుడ్ నుంచి వినిపిస్తున్న వివరాల ప్రకారం…టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరితో స్వీటి ప్రేమలో నిగిపోయిందట….సదరు ప్రొడ్యూసర్ తో అమ్మడు చట్టాపట్టాల్ వేసుకుని తెగ తిరిగేస్తోందట. ఇంతవరకూ బాగానే ఉంది కానీ….వీరి ప్రేమలో ట్విస్ట్ ఏంటంటే.. స్వీటీ ప్రేమిస్తున్న నిర్మాతకు గతంలోనే ఆల్‌రెడీ పెళ్లైందట. ఇక అదే క్రమంలో….ఒకవైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే…మరోవైపు…తననే నమ్ముకున్న లవర్ కు న్యాయం చేస్తోందట. అతడితో కలిసి ప్రేమలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తోందట. ఇక ఈ విషయం తెలుసుకున్న రెండు కుటుంభాలు…వీరి పెళ్ళికి ఒకే చెప్పడంతో త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయినట్లు సమాచారం. ఏది ఏమైనా…చేతి నిండా…సినిమాలతో బిజీగా గడిపేస్తున్న ఈ బ్యూటీ…ఎంత త్వరగా శ్రీమతిగా మారుతుందో చూడాలి.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
















