భాగమతి తర్వాత అనుష్క చేసే సినిమా టైటిల్ ఫిక్స్

అరుంధతి సినిమాతో అనుష్క మంచి పేరు తెచ్చుకుంది. హీరోయిన్ గా అందాలు ఆరబోస్తూనే మంచి పాత్రలు వస్తే ఎంతకష్టమైనా చేసుకొచ్చింది. బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. బాహుబలి తర్వాత ఎన్నో ఆఫర్లు వచ్చినప్పటికీ భాగమతి అనే సినిమాని మాత్రమే చేసింది. ఇది కూడా సూపర్ హిట్. దీని తర్వాత కూడా విశ్రాంతి తీసుకోవడానికే సమయం కేటాయించింది. దీంతో పెళ్ళికి రెడీ అవుతున్నట్లు గాసిప్స్ షికారు చేసాయి. పుకార్లు ఇబ్బంది పెడుతున్న ఆమె మాత్రం కుటుంబ సభ్యులతో కలిసి గడపడానికి ఇష్టపడింది. తాజాగా ఆమె రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. అందులో ఒకటి చిరంజీవి 152 సినిమా. కొరటాల శివ దర్శకత్వం వహించనున్న ఈ మూవీ వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో సెట్స్ మీదకు వెళ్లనుంది.

ఇందుకు ఎక్కువ సమయం ఉంది. అప్పటిలోపున మరో సినిమాని కంప్లీట్ చేయడానికి అనుష్క డిసైడ్ అయింది. తెలుగులో వస్తాడు నారాజు, హిందీలో ముంబై 125 కిలో మీటర్లు.. వంటి సినిమాలను తెరకెక్కించిన హేమంత్ మధుకర్ తెలుగులో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కోసం మాధవన్ ను ఎంపిక చేసుకున్న ఆయన, తాజాగా అనుష్కను తీసుకున్నారని తెలిసింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న ఈ సినిమాకి “సైలెన్స్” అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు ఫిలిం నగరవాసులు చెప్పారు. హేమంత్ మధుకర్ తీసుకునే కథలు విభిన్నంగా ఉంటాయి. ఆ తరహాలోనే ఈ కథ ఉంటుందని టాక్. త్వరలోనే ఈ మూవీ గురించి అధికారిక ప్రకటన రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus