‘వి’ చిత్రం తరువాత అంత క్రేజ్ సంపాదించుకున్న చిత్రం ‘నిశ్శబ్దం’.ఎప్పుడైతే ‘వి’ ని ఓటిటిలో దింపుతున్నట్టు ప్రకటించారో.. అప్పటి నుండీ ‘నిశ్శబ్దం’ వైపే అందరి చూపు మళ్లింది. రెండేళ్ల తరువాత అనుష్క నుండీ రాబోతున్న చిత్రం కావడంతో మొదటి నుండీ ఈ చిత్రం పై భారీ హైప్ ఏర్పడింది. నిజానికి ఏప్రిల్ 2న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చెయ్యాలి అని నిర్మాతలు ప్లాన్ చేశారు. కానీ కరోనా వల్ల ఏర్పడిన లాక్ డౌన్ వల్ల అది సాధ్యం కాలేదు.
‘వస్తాడు నా రాజు’ ఫేమ్ హేమంత్ మధుకర్ ఈ చిత్రానికి దర్శకుడు. కోన వెంకట్, విశ్వప్రసాద్ లు కలిసి ఈ చిత్రాన్ని 30కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. అమెజాన్ ప్రైమ్ నుండీ ‘నిశ్శబ్దం’ కు 24కోట్ల ఫ్యాన్సీ ఆఫర్ దక్కిందట.దాంతో తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్ లో విడుదల చెయ్యడానికి రెడీ అయ్యారు దర్శకనిర్మాతలు.ఈ చిత్రంలో అనుష్క మూగ అమ్మాయిగా కనిపించబోతుండగా… మాధవన్ అంధుడి పాత్రలో కనిపించబోతున్నాడు.
అంజలి,షాలినీ పాండే, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్ వంటి నటీనటులు కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఇదిలా ఉండగా.. అక్టోబర్ 2నే రాజ్ తరుణ్ నటించిన ‘ఒరేయ్ బుజ్జిగా’ చిత్రం కూడా ‘ఆహా’ లో విడుదల కాబోతుంది. అయితే అనుష్క ‘నిశ్శబ్దం’ పై ఎక్కువ క్రేజ్ ఉంది కాబట్టి.. ఆ చిత్రానికి ఇది పెద్ద దెబ్బే అని చెప్పాలి.
Most Recommended Video
ఇప్పటవరకూ ఎవరు చూడని యాంకర్ లాస్య రేర్ ఫోటో గ్యాలరీ!
సినిమాకి.. సినిమాకి మధ్య ఎక్కువ గ్యాప్ తీసుకున్న టాలీవుడ్ హీరోలు వీళ్ళే?
బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!