డబ్బింగ్ చెప్పుకోకపోవడానికి కారణం చెప్పిన అనుష్క

  • February 8, 2018 / 11:45 AM IST

స్వీటీ అనుష్కని అభిమానించని వారుండరు. పెద్ద స్టార్ అయినప్పటికీ డైరక్టర్లు చెప్పినట్టుగా నటిస్తుంది. పాత్ర ఒప్పుకుంటే ఎంత కష్టమైనా వెనుకడుగు వేయదు. ఎవరితో గొడవపడిన.. వివాదాల్లో ఇరుకున్న సందర్భాలు లేవు. అయితే ఒక చిన్న ఆరోపణ మాత్రం ఉంది. పరిశ్రమలోకి వచ్చిన కొత్తవారు తొలి సినిమాకే డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. ఇన్నేళ్ళుగా తెలుగు చిత్రాలు చేస్తున్న అనుష్క ఎందుకు డబ్బింగ్ చెప్పదు? తెలుగు ఇంకా నేర్చుకోలేదా? అని విమర్శ ఉంది. దీనిపై అనుష్క తాజాగా స్పందించింది. “నేను తెలుగు మాట్లాడగలను. కానీ, డబ్బింగ్ చెప్పే ధైర్యం మాత్రం నాకు లేదు.

ఎందుకంటే నేను మాట్లాడుతుంటే పక్కవాళ్లకు కూడా వినిపించదని మా ఇంట్లో వాళ్లు అంటూ ఉంటారు. నా వాయిస్ చిన్నపిల్లల మాదిరిగా ఉంటుంది. `అరుంధతి` సినిమాలోని “నువ్వు నన్నేం చేయలేవురా” అనే డైలాగ్ ఇంటి దగ్గర ఎన్నోసార్లు ప్రాక్టీస్ చేశాను. కానీ, అంత గట్టిగా చెప్పలేకపోయాను. నేనే డబ్బింగ్ చెపితే క్యారెక్టర్ దెబ్బతింటుంది. అందుకే డబ్బింగ్‌కు దూరంగా ఉన్నాను” అని అనుష్క వివరించింది. ఇది మంచి కారణం కాబట్టి అనుష్కపై ఉన్న ఈ చిన్న విమర్శ కూడా కరిగిపోయింది. బాహుబలి తర్వాత అనుష్క.. అశోక్ దర్శకత్వంలో నటించిన భాగమతి గత నెల రిలీజ్ అయి భారీ కలక్షన్స్ రాబట్టింది. ఓవర్సీస్ లోను వన్ మిలియన్ డాలర్లు వసూలు చేసి అనుష్క క్రేజ్ ని చాటింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus