Anushka Sharma: రెండో సారి తల్లి కాబోతున్న అనుష్క.. బేబీ బంకు ఫోటో వైరల్!

బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో అనుష్క శర్మ ఒకరు. నటిగా ఇండస్ట్రీలో ఎంతోమంది సక్సెస్ అందుకున్నటువంటి ఈమె కెరియర్ పీక్ స్టేజ్ లో ఉండగానే ప్రముఖ క్రికెట్ విరాట్ కోహ్లీతో ప్రేమలో పడ్డారు. ఇలా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట రహస్యంగా తమ ప్రేమ ప్రయాణం కొనసాగిస్తూ చివరికి పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. ఈ విధంగా విరాట్ కోహ్లీ వారి కెరియర్ పరంగా ఇద్దరు బిజీ అయ్యారు.

అయితే అనుష్క శర్మ మొదటిసారి వామిక అనే అమ్మాయికి జన్మనిచ్చారు. పాప పుట్టిన తర్వాత ఈమె పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు అయితే నిర్మాతగా మాత్రం ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇలా కెరియర్ పరంగా అనుష్క సినిమాలకు కాస్త దూరంగానే ఉన్నారనే సంగతి తెలిసిందే. ఇలా తన కుమార్తెతో ఎంతో సంతోషంగా గడుపుతున్నటువంటి ఈమె త్వరలోనే మరోసారి తల్లి కాబోతున్నారు అంటూ ఒక వార్త వైరల్ గా మారింది.

ఈ మధ్యకాలంలో అనుష్క శర్మ (Anushka Sharma) బయటకు వచ్చిన ప్రతిసారి తన పొట్ట కనపడకుండా జాగ్రత్త పడుతున్నారు అలాగే తరచూ ఈమె ప్రెగ్నెన్సీ గురించి ఎన్నో రకాల వార్తలు వస్తున్న పెద్దగా ఈ వార్తలపై రియాక్ట్ అయినటువంటి దాఖలాలు లేవు అయితే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫోటో చూస్తే కనుక ఈమె ప్రెగ్నెంట్ అనే విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. మొబైల్ వన్ ప్రమోషన్ కోసం అనుష్క శర్మ ఓ ఫోటోను పోస్ట్ చేసింది.

ఈ పోస్ట్‌ కు సమయం చాలా వేగంగా పరిగెడుతోందని రాసుకొచ్చారు. ఆ ఫోటో చూసిన వెంటనే అనుష్క రెండోసారి ప్రెగ్నెంట్ అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్ ఈ ఫోటోలో ఈమె బేబీ బంప్ ఉన్నట్టు కనిపించడంతో పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా తాను తల్లి కాబోతోందని కామెంట్ చేస్తున్నారు మరి ఇందులో ఎంతవరకు నిజముంది తెలియాలి అంటే ఈ వార్తలపై అనుష్క శర్మ స్పందించాల్సి ఉంది.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus