Anushka: అనుష్క ఇంటి కోడలుగా చేసుకోవడం కోసం తపన పడిన సీనియర్ డైరెక్టర్?

  • July 13, 2023 / 08:06 PM IST

పూరి జగన్నాథ్ నాగార్జున కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం సూపర్. ఈ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు నటి అనుష్క శెట్టి. ఇలా సూపర్ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె ఇండస్ట్రీలో వెనక్కి తిరిగి చూసుకోలేదు. అరుంధతి వంటి లేడీ ఓరియంటెడ్ సినిమా ద్వారా ఇండస్ట్రీ హిట్ అందుకున్న ఈమె లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు. ఇలా ఎన్నో లేడీ ఓరియంటెడ్ సినిమాలో కమర్షియల్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు.

ఇక అనుష్క (Anushka) కెరియర్లో సైజ్ జీరో వంటి ప్రయోగాత్మక సినిమాలు కూడా ఉన్నాయని చెప్పాలి. ఇలా ఎన్నో విభిన్న సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనుష్క బిగ్ స్క్రీన్ పై కనపడి దాదాపు నాలుగేళ్లు అవుతుంది. బాహుబలి తర్వాత నిశ్శబ్దం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఈ సినిమా ఓటీటీలో విడుదలైంది. ఇలా చాలా సంవత్సరాల తర్వాత అనుష్క తిరిగి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది.

ఈ సినిమా ఆగస్టు 4వ తేదీ విడుదల కానుంది. ఇకపోతే అనుష్క గురించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అనుష్క ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో ఒక సీనియర్ డైరెక్టర్ అనుష్కను తన కుమారుడిని పెళ్లి చేసుకోమని నేరుగా తనని అడిగారట. ఈ విధంగా అనుష్కని ఇంటి కోడలుగా చేసుకోవాలనుకున్న ఆ డైరెక్టర్ మరెవరో కాదు సీనియర్ దర్శకుడు కె రాఘవేంద్రరావు ఈయన తన కుమారుడు ప్రకాష్ కిపెళ్లి చేయాలనుకున్న తరుణంలో అనుష్కను తన ఇంటి కోడలుగా చేసుకోవాలని భావించి తనని అడిగారట

అయితే ఆమె తనకిప్పుడే పెళ్లి చేసుకోవాలని ఆలోచన కూడా లేదని సున్నితంగా తిరస్కరించారట దీంతో రాఘవేంద్రరావు కనిక అనే అమ్మాయితో తన కొడుకు వివాహం జరిపించారు అయితే కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus