తెలుగు తమిళ భాషల్లో అనుష్క అగ్ర తారగా కొనసాగుతుంది. అయితే ఇటీవల ఆమె చేసిన సినిమాలు తక్కువే..! ‘భాగమతి’ చిత్రం తర్వాత అనుష్క మరే చిత్రంలోనూ నటించలేదు. ప్రస్తుతం కోనవెంకట్ సమర్పణలో, హేమంత్ మధుకర్ డైరెక్షన్లో తెరకెక్కబోయే ఓ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది అనుష్క. సస్పెన్స్ థ్రిల్లర్ గా సాగే కదంశంతో తెరెక్కబోతున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో మొదలుకాబోతుంది. అనుష్క ప్రధాన పాత్ర పోషించబోతుండగా… కోలీవుడ్ నటుడు మాధవన్ కూడా ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో పోషిస్తున్నాడు. ఇదిలా ఉండగా అనుష్క తాజా పిక్ ఒకటి ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తుంది.
అనుష్క బీచ్ లో సరదాగా కూర్చుని ఉన్న ఈ పిక్ లో చాలా సన్నగా .. నాజూగ్గా కనిపిస్తుండడం విశేషం. ‘భాగమతి’ చిత్రంలో అనుష్క కొంచెం బొద్దుగా కనిపించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ మధ్య సహజ సిద్దమైన థెరెఫీ కోసం విదేశాలు వెళ్ళింది మన స్వీటీ. గత నాలుగు నెలలుగా అక్కడ ఈ థెరెఫీ తీసుకుంటూ వస్తుంది. ఇప్పుడు అనుష్క ఇప్పటి హీరోయిన్లకు మాదిరే చాలా సన్నంగా కనిపిస్తుంది. దీనితో అనుష్క అభిమానులు ఆనందంతో ‘అనుష్క ఈజ్ బ్యాక్’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. అనుష్క ఇలా సన్నబడడానికి ముఖ్య కారణం తన ట్రైనర్ ‘లూక్ కొటిన్హో’. ఇతను అనుష్క ఫిట్నెస్ మరియు హెల్త్ కేరర్ అనమాట. అతను ఇచ్చిన డైట్ ని అనుష్క క్రమంగా ఫాలో అయ్యేదట..! ఇక అనుష్క ఇలా స్లిమ్ గా తయారవ్వడంతో.. ఇప్పటివరకూ టాలీవుడ్లో జోరు చూపిస్తున్న యువ కథానాయికలకు అనుష్క డామినేట్ చేయడం ఖాయమంటున్నారు ఫిలింనగర్ విశ్లేషకులు. అంతేకాదు ప్రస్తుతం మెగాస్టార్ – కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కబోయే చిత్రంలో కూడా అనుష్క పేరు పరిశీలిస్తున్నట్టు సమాచారం. ‘స్టాలిన్’ చిత్రంలో ఓ పాటకి చిందేసిన ఈ జంట మరోసారి కనిపించే అవకాశం ఉందంటున్నారు ఫిలింనగర్ విశ్లేషకులు. దీనితో పాటు ప్రముఖ నటుడు మరియు డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న ‘మన్మధుడు 2’ సీక్వెల్ లో అనుష్క ఓ హీరోయిన్ గా నటించబోతుందని తెలుస్తుంది. గతంలో నాగార్జున – అనుష్క కాంబినేషన్లో ‘సూపర్’ ‘డాన్’ ‘రగడ’ ‘డమరుకం’ వంటి చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు మరోసారి నాగ్ సరసన అనుష్క జతకడుతున్న మాట. అంతే కాదు ఇప్పుడు ‘ప్రభాస్ 20’ లో కూడా అనుష్క ఓ ముఖ్య పాత్ర పోషిస్తుండట. ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నాడు.