‘బిగ్ బాస్ సీజన్ 9’ క్లైమాక్స్‌కి చేరుకుంది. ఈ వారమే గ్రాండ్ ఫినాలే జరగనుండటంతో హౌస్‌లో హీట్ పెరిగింది. ప్రస్తుతం ఆరుగురు కంటెస్టెంట్స్ ఉండటంతో, ఫైనల్ వీక్ కోసం డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్ ఇచ్చారు హోస్ట్ నాగార్జున. ఇందులో భాగంగా శనివారం ఎపిసోడ్‌లో సీనియర్ కమెడియన్ సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యారు.హౌస్‌లో ఎలాంటి గొడవలు, నెగిటివిటీ, కాంట్రవర్సీలు లేకుండా సుమన్ శెట్టి సాగించిన జర్నీ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఆయన ఎలిమినేషన్ అనౌన్స్ చేయగానే హౌస్‌మేట్ భరణి ఎమోషనల్ అయ్యాడు. బయటకెళ్లాక ఇద్దరం కలిసే వర్క్ చేద్దామని భరణి మాట ఇచ్చాడు. ఇక ఇమ్మాన్యుయేల్ అయితే ‘సుమన్ శెట్టి ప్రభంజనం’ అంటూ గట్టిగానే ఎలివేషన్ ఇచ్చాడు. చివరగా తన ట్రేడ్ మార్క్ డైలాగ్ ‘అధ్యక్షా.. వెళ్లొస్తా’ అంటూ, భరణిని జాగ్రత్తగా చూసుకోండని చెప్పి సుమన్ హౌస్ వీడాడు.

స్టేజ్ మీదకు వచ్చాక నాగ్ అడిగిన ప్రశ్నలకు సుమన్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ ఇచ్చాడు. మరో వారం ఉంటే టాప్-5లో ఉండేవాడిని అని, అయినా సంతోషంగానే ఉందని చెప్పాడు. ఇక హౌస్‌లో బొగ్గు ఎవరు? బంగారం ఎవరు? అని నాగ్ టాస్క్ ఇవ్వగా.. ఎవరూ బొగ్గు లేరని, అందరూ బంగారమే అని చెప్పి సుమన్ మరోసారి తన మంచితనాన్ని చాటుకున్నాడు.
అసలు విషయం ఏంటంటే.. విన్నర్ ప్రైజ్ మనీకి దగ్గరగా సుమన్ శెట్టి రెమ్యునరేషన్ తీసుకున్నాడని ఇండస్ట్రీ టాక్. సోషల్ మీడియా లెక్కల ప్రకారం.. ఆయనకు రోజుకు రూ.45 వేల చొప్పున డీల్ కుదిరిందట. అంటే ఈ 14 వారాలకు గానూ ఏకంగా రూ.44 లక్షల వరకు వెనకేసుకున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ హిస్టరీలోనే హైయెస్ట్ పెయిడ్ కంటెస్టెంట్లలో సుమన్ శెట్టి సెకండ్ ప్లేస్‌లో ఉంటారని సమాచారం. ఇక ఆదివారం ఎపిసోడ్‌లో భరణి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని లీక్స్ వస్తున్నాయి.
