‘ది రాజాసాబ్'(The RajaSaab) నుండి ఆల్రెడీ ఫస్ట్ సింగిల్ గా ‘రెబల్ సాబ్’ సాంగ్ రిలీజ్ అయ్యింది. అందులో ప్రభాస్ ఫ్యాన్స్ కి నచ్చేలా కొన్ని వింటేజ్ వైబ్స్ ఇచ్చారు కానీ.. సాంగ్ అయితే జనాలకి ఎక్కలేదు. సినిమా ప్రమోషన్ కి ఏమాత్రం ఉపయోగపడలేదు. సంగీత దర్శకుడు తమన్ డిజప్పాయింట్ చేశాడు అనే కామెంట్స్ కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సెకండ్ లిరికల్ సాంగ్ గా ‘సహనా సహనా’ అనే పాటని రిలీజ్ చేశారు.
ఈ సాంగ్ విషయానికి వస్తే ఇది 2 నిమిషాల 34 సెకన్ల నిడివి కలిగి. ‘సహనా సహనా నా సఖి సహనా కలలో నిన్నే చూశానా..సహనా సహనా అతిశయ సుగుణా మనసే నీకే రాశానా’ అంటూ మొదలైంది ఈ పాట. ‘శరత్ చంద్రిక తేజ యామిని’ అంటూ వచ్చే లిరిక్స్ వద్ద మంచి హై వచ్చింది. సంగీత దర్శకుడు తమన్ హెవీ సౌండ్స్ పెట్టేయకుండా మెలోడీ సాంగ్ కి అవసరమైనట్టు ట్యూన్ కి.. ట్యూన్ కి మధ్య స్పేస్ ఇచ్చాడు.

విశాల్ మిశ్రా, తమన్,శృతి రంజని ఈ పాటని ఆలపించారు. కృష్ణ కాంత్ అందించిన లిరిక్స్ బాగున్నాయి. ప్లెజెంట్ ఫీలింగ్ కలిగిస్తాయి. ఈ సాంగ్లో నిధి ఎంత గ్లామర్ షో చేసినా.. ప్రభాస్ తన శ్వాగ్ తో ఆమెను కూడా డామినేట్ చేసేశాడు అని చెప్పాలి. ఈ సాంగ్ ఎక్కడానికి టైం పట్టొచ్చు కానీ.. ప్రభాస్ కోసం, సాంగ్లోని విజువల్స్ కోసం రిపీటెడ్ గా ఫ్యాన్స్ చూసే అవకాశం ఉంది. మీరు కూడా ఓ లుక్కేయండి :
